నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ తో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
District Collector S Venkateshwar visited the Nelapattu Bird Sanctuary along with Sullurpet MLA Nelawala Vijaya Shri.
ఈనెల 18,19మరియు 20 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ఘనంగా అందరు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నిర్వహిద్దాం:
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల అభయారణ్యంను, పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సందర్శించి, ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత అధికారులకు దేశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020 సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించి ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించడం జరగలేదని, ప్రస్తుత మన గౌరవ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18,19 మరియు 20 తేదీలలో మూడు రోజులపాటు ఐదు ప్రాంతాలలో నేలపట్టు, బి.వి పాలెం, అటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏర్పాట్లలో ఏలాంటి లోటుపాట్లు ఉండరాదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం నందు ఉన్న విలక్షణ, పర్యావరణ వైవిధ్యం కారణంగా గ్రేపెలికాన్ పక్షులు, కార్మోనెట్ బిల్ పక్షులు(నీటి కాకులు), స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షులు నేలపట్టు అభయారణ్యానికి ఆలవాలమని తెలిపారు. ఈ వలస పక్షులు సుదూర విదేశీ ప్రాంతాల నుండి వచ్చి వాటి సంతతిని పెంపొందించుకొని వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్ర నీటి నుండి తీసుకువచ్చి అందించి వాటిని పెంచి స్విమ్మింగ్, ఫ్లయింగ్ నేర్పించి అనంతరం మార్చి, ఏప్రిల్ మాసాలలో వాటి స్వంత ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతాయని అన్నారు. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకొనడానికి వీలుగా నేలపట్టు అభయారణ్యం నందు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహణలో భాగంగా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు.
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఈనెల 18,19మరియు 20 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా అందరు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ గారు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు కలెక్టర్, ఎంఎల్ఏ లతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా వారిని విజ్ఞాన సందర్శనకు వచ్చినందుకు కలెక్టర్ మెచ్చుకున్నారు.