- Advertisement -
తలగాసిపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
District SP inspected the road accident site near Talagasipally
రోడ్డు ప్రమాదం కారణాలపై ఆరా…
నిశితంగా పరిశీలన
అనంతపురం :
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి ఎస్పీ చేరుకొని అక్కడ ఘటన జరిగిన తీరును మరియు అందుకు కారణాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రూరల్ డి.ఎస్.పి టి.వెంకటేశులు మరియు ఇతర పోలీసు అధికారులు వెళ్లారు
- Advertisement -