Sunday, September 8, 2024

బీఆర్‌ఎస్ గెలుపులో దివ్యాంగులదే ప్రధాన పాత్ర

- Advertisement -

కారుతో పోలిన గుర్తుల విషయంలో జాగ్రత్త వహించాలి
ఎమ్మెల్సీ ఎల్‌. రమణ
సేవ చేసేందుకే ఉన్న…
చెయ్యిగుర్తు, పువ్వు గుర్తు ఉన్నకాడ పింఛన్‌ వెయ్యి కూడా ఇస్తలే
77ఏండ్లు పాలించిండ్రు…పైసా ఇయ్యలే..తులం బంగారమిస్తరట
కాంగ్రెస్,బీజేపీలవన్నీ అబద్దాలే
సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఆత్మబంధువైండు
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల: బీఆర్‌ఎస్ గెలుపులో దివ్యాంగులదే ప్రధాన పాత్ర అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్‌. రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జగిత్యాల నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌  చైర్మెన్‌ వాసుదేవరెడ్డి, జడ్పీ చేర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్‌. రమణ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్‌ అందిస్తున్న సర్కారు కేసీఆర్‌ సర్కారని, వచ్చే ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6 వేలకు పెంచుతామని ప్రకటించిన దమ్మున్న సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం, రూ. 400కే సిలిండర్‌ అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టామన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వంద సీట్ల గెలుపులో దివ్యాంగులదే కీలక పాత్ర అని, ఈవిఎంలలో కారు గుర్తును పోలిన ఇతర గుర్తుల విషయంలో జాగ్రత్త వహించాలని, కారు గుర్తును గుర్తించి ఓటు వేసి డా. సంజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

సేవ చేసేందుకే ఉన్నా…సేవాగుణం నా రక్తంలోనే ఉంది

రాజకీయాల్లోకి రాకముందే రోటరీ క్లబ్‌, లయన్స్‍ క్లబ్‌, ఐఎంఏ వంటి సంస్థల ఆద్వర్యంలో సేవలందించానని, అందరూ సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారని, కాని నేను 30ఏండ్లు ప్రజలకు సేవ చేసిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.సేవా తోనే బి అర్ ఎస్ టికెట్ వచ్చినదని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశాన్ని జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అందించడం వరమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనునిత్యం నియోజకవర్గ అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టానన్నారు. పేదలకు సేవ చేసే వారే నిజమైన సేవకులని, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, ఆసరా, దివ్యాంగులు, బీడీ,ఒంటరి మహిళలకు పింఛన్‌లు, గురుకులాలు, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల ఆత్మబంధువుగా మారాడన్నారు. సీఎం కేసీఆర్‌ అంటేనే ఒక భరోసా అన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు సీఎం కేసీఆర్‌ రైతు బంధు ఇస్తుంటే ఈ పథకాన్ని కాపీ కొట్టిన మోదీ సర్కారు రాష్ట్రంలో 30లక్షల మందికి సైతం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని అందచేయడం లేదన్నారు.
77 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న పెన్షన్‌ను చెయ్యి గుర్తు, పువ్వు గుర్తు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని వారు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలా ఇస్తారని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. కాంగ్రెస్లో సీఎం ఎవరో తెలియదు…పథకాలు ఎవరిస్తరో తెల్వదని, లేచినప్పటి నుండి మొదలు పడుకునే వరకు కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడేవన్నీ అబద్దాలేనన్నారు. కాంగ్రెస్ బీజేపీ వాల్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఆడబిడ్డల పెండ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎవరూ చెప్పకున్నా ఇక్కడ మాత్రం జీవన్‌ రెడ్డి తులం బంగారం ఇస్తామంటూ ప్రచారం చేస్తుండని, ఆయన జేబులో నుండి ఇస్తాడా…రాజకీయాల్లో పైసా సంపాదించలేదని చెబుతున్న జీవన్‌ రెడ్డి మాటలు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు. రానున్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని 94లక్షల మంది కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామని, ప్రతి మహిళకు రూ. 3వేల పెన్షన్‌, ప్రతి బీద వానికి కేసీఆర్‌ బీమా పథకం ద్వారా రూ. 5లక్షల బీమాను చేస్తామన్నారు. దివ్యాంగులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, నియోజకవర్గంలోని 5వేల దివ్యాంగ కుటుంబాల వారు తనను ఆశీర్వదించి గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చేర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దివ్యాంగులను ఓటు బ్యాంకు గానే చూశాయని, కాని కేసీఆర్‌ దివ్యాగులను గుర్తించి రూ. 500 ఉన్న పెన్షన్‌ను రూ. 1500కు ఆ తర్వాత అంచెలంచెలుగా నేడు రూ. 4వేలకు పెంచి దివ్యాంగులు ఆత్మగౌరవంగా జీవించేలా చేశారన్నారు. ఇప్పటికే పెన్షన్‌ రూ. 4వేలు ఇస్తుండ్రు…ఇంక కాంగ్రెస్ వాల్లు ఇచ్చేదేంది అని వాసుదేవరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు ఇప్పటికే పెన్షన్‌ను రూ. 4వేలు అందిస్తున్నారని, రానున్న ప్రభుత్వంలో రూ. 6వేలకు పెంచుతామని హామీ ఇస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ వాసుదేవరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం జోడెడ్ల వలె ఉరుకుతున్నయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల బతుకులను సీఎం కేసీఆర్‌ మార్చారన్నారు. తల్లితండ్రులకే భారంగా మారిన నేపద్యంలో దివ్యాంగులకు పెన్షన్‌ పెంచి గల్లా ఎగురవేసుకుని, ఆత్మనిబ్బరంగా జీవించేలా చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకివ్వడం లేదని, వెయ్యి రూపాయలకు మించి మిగతా రాష్ట్రాలు ఎందికివ్వడంలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఇస్తరో ఒక్కరు కూడా చెప్పడంలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాటలు నమ్మవద్దని, జగిత్యాల నియోజకవర్గంలోని 20వేల ఓట్లు కారు గుర్తుకు గుద్ది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బైర్లు కమ్మేలా డా. సంజయ్‌ కుమార్‌ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అజ్గర్ మహమ్మద్ ఖాన్, జిల్లా బీఆర్ఎస్ ముఖ్య సలహాదారు బండి సత్యనారాయణ,  జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపెళ్లి శ్రీధర్, గొడిసెల గంగాధర్,మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్,నాయకులు సంజీవ రావు, హరి అశోక్ కుమార్,సతీష్ రాజ్,సర్పంచులు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్లు,ముఖ్య నాయకులు,దివ్యాంగులు,
,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్