అధికారం పోయిందని అక్కసుతో మాట్లాడడం సరికాదు
జగిత్యాల ఎమ్మెల్యే చౌకబారు విమర్శలు మానుకోవాలి
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి ధ్వజం
జగిత్యాల: అధికారం పోయిందనే అక్కసుతో బి ఆర్ ఎస్ కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన చౌకబారు విమర్శలు మానుకోవాలని, పదేళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం విజయలక్ష్మి మాట్లాడుతూ రాయికల్ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై , కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన విమర్శలను మహిళా కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నమ్మన్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో అవినీతి పాలనతో అధికారం చెలయించిన బీఅర్ఎస్ పార్టీలో వణుకు మొదలైందని ఎమ్మెల్యే సంజయ్ మాటలు వింటే స్పష్టం అవుతొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలన్నారు.
రైతు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు పాలనా సాగుతుందని గమనించాలని ఆమే హితవు పలికారు.
2004-2014 వరకు ఇచ్చిన ఇందిరమ్మ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, గాలిలో మేడలతో ప్రజలు బీఅర్ఎస్ పాలనపై విసుగు చెందరన్నారు. 2014-2023 వరకు మీ ప్రభుత్వం ఎన్ని ఇల్లు మంజూరు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని విజయలక్ష్మి ఎమ్మెల్యే కు సవాల్ విసిరారు.
ఇప్పుడు కట్టిన 4 వేల ఇళ్ల ప్రాజెక్ట్ రూపాకల్పనా చేసింది కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి అని, ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల శంకుస్థాపన ఎమ్మెల్యే గా జీవన్ రెడ్డి హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి 24 గంటలు గడవక ముందే కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని మాట్లాడ్డం, ఆరు గ్యారంటీ లు అమలు ఎదని ప్రశ్నించడం ఎమ్మెల్యే రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విజయలక్ష్మి పేర్కొన్నారు.
కల్లాల్లో తుఫాన్ కారణంగా వడ్లు అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతుంటే, గతంలో తరుగు పేరుతో దోపిడీకి రైతంగం గురైతే అధికారంలో ఉండి మిల్లర్ల దోపిడీ అడ్డుకోలేని వ్యక్తి రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతిగా ఉన్న జీవన్ రెడ్డిని ప్రశ్నించడం విడ్డురంగా ఉందన్నారు.
తరుగు పేరుతో దోపిడీ చేసిన ప్రభుత్వంకు, ప్రభుత్వం లో ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు, బోనస్ గురించి గాని, మద్దతు ధర గురించి గాని, కౌలు, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు.
ప్రభుత్వం పై ఇప్పటినుంచే విషం చిమ్మడం మానుకోవాలని, జీవన్ రెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే తీరుపై విజయలక్ష్మి మండిపడ్డారు.