రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేయరాదు
సీఎం సిద్ధరామయ్య, బెంగళూర్ పోలీస్ కమిషనర్‌లకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి
బెంగళూర్ మార్చ్ 2
బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మంత్రులను నిలువరించాలని సీఎం సిద్ధరామయ్య, బెంగళూర్ పోలీస్ కమిషనర్‌లకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే పేలుడు జరిగిందని, రాజకీయ శత్రుత్వమే ఇందుకు కారణమని పేర్కొనడం వంటి రాష్ట్ర మంత్రుల ప్రకటనలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఊహాగానాలకు దూరంగా ఉండాలని బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి దయానంద మీడియాకు చేసిన వినతి నేపధ్యంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం కేఫ్ ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని, పలు బృందాలు దీనిపై పనిచేస్తున్నాయని, కేసు సున్నితత్వం, భద్రతా ఆందోళనల దృష్ట్యా మీడియా ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా సహకరించాలని కమిషనర్ ట్వీట్ చేశారు.మరోవైపు ఈ ఘటనను రాజకీయం చేయవద్దని విపక్షాలకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు అనుమానితుడు పేలుడు పదార్ధాలతో కూడిన బ్యాగ్‌తో కేఫ్ వైపు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. అనుమానితుడు యువకుడని అతడి వయసు 28 నుంచి 30 ఏండ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకునేందుకు పలు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేయరాదు

- Advertisement -
- Advertisement -