Sunday, September 8, 2024

ఇక నాతో అవసరం తీరిందా..? : ఓ యూ

- Advertisement -
  • ఏమైంది ఈ విశ్వవిద్యాలయాలకు ?

    do-you-need-me-anymore-oh-you
    do-you-need-me-anymore-oh-you
  • మూగబోతున్నాయా మూతబడునున్నాయ?
  • సమస్యల సుడిగుండంలో విశ్వవిద్యాలయాలా?
  • వక్రమార్గానికి అలవాటు పడుతున్న కొందరు మేధావి అధికారులా?
  • మళ్లీ కాంట్రాక్టు సిబ్బంది పొట్ట కొట్టే యోచనలో అధికారులా?
  • సమస్యలకు పరిష్కారం చూపే మేధావి, అధికారులు లేరా?
  • సీఎం సారు… చూడండి ఒక మారు.

తార్నాక, ఓ యు క్యాంపస్: జులై 28 ( వాయిస్ టుడే ప్రతినిధి ): ప్రపంచంలోనే ప్రతిష్ట గాంచిన  విశ్వవిద్యాలయం, దేశానికి ఎంతోమంది గొప్ప మేధావులను అందించిన విశ్వవిద్యాలయం, శత సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం

ఎన్నో సమస్యల సుడిగుండం లో మునిగిపోయింది, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అధికారం మేధావి అధికారుల చేతిలో లేదా, లేక సమస్యను ఎలా పరిష్కరించాలో వారి మేదో సంపత్తికి అంతు పట్టడం లేదా, కొంతమంది కక్కుర్తి మేధావి అధికారులు అక్రమార్కులకు అలవాటు పడుతున్న వైనం, ఎన్నో ఆలోచనలకు అనుమానాలకు తావిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల కొరత ఒకవైపు,  అధిక ఫీజుల భారం తో విద్యార్థుల సమ్మెలు మరొకవైపు,  రెగ్యులర్ కోర్సుల్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు గా మార్చడం ఒకవైపు, కాంట్రాక్ట్ సిబ్బంది ఉద్యోగుల సమ్మెలు  ఒకవైపు, చాలీచాలని నిధుల కొరత మరొక వైపు ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న విశ్వవిద్యాలయం.

విశ్వవిద్యాలయాలను విద్యావ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం మేధావి అధికారుల పైన ఎంతైనా ఉంది, కానీ  మొన్నటికి మొన్న కరీంనగర్లో ని శాతవాహన యూనివర్సిటీలో లేని కోర్సు కు నియామకాలు చేపట్టి లక్షలకు లక్షలు జీతాలు ఇస్తున్న అధికారులు, దానికి ముందు నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు, నియామకాల అవకతవకలకి పాల్పడ్డ అధికారులు, కోట్ల కొద్ది ప్రజా సొమ్మును అక్రమంగా కొల్లగొడుతున్న కొందరు మేధావి అధికారులు, ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారి పొట్టన కొట్టిన అధికారులు, అలా చేయడం మేధావులకు  తగునా అసలు వీళ్ళని మేధావులు అందామా అనే ఆలోచనకు తావిస్తోంది.

do-you-need-me-anymore-oh-you
do-you-need-me-anymore-oh-you

ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలో ఇంచుమించుగా అన్ని ఇలాంటి సమస్యలే, ఇన్ని సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశ్వవిద్యాలయాల ఆధికారులు విద్యా వ్యవస్థని నీరు కారుస్తున్నారు అనడంలో సందిగ్ధమే లేదు, గత సంవత్సరాల చరిత్రలో విద్యారంగ సమస్యలు లేవని కాదు, ఉన్నా అప్పుడున్న అధికారులు వాటిని అన్ని కోణాల్లో పరిశీలించి, పరీక్షించి, కమిటీలు వేసి, సమావేశాలు ఏర్పాటు చేసి అనతి కాలంలోనే సమస్యలకు ఒక చక్కని పరిష్కారాన్ని అందించేవారు, ఒకవేళ వారికి ఏదైనా సందేహం వస్తే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు, కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు, అధికారి మేధావులు కొంతమంది కక్కుర్తి మేధావులు వారి స్వలాభం కోసం, సమస్యలకు పరిష్కారాలు చూపకుండా సమస్యలను సమస్యల సుడిగుండంలో నెట్టి వేస్తున్నారు. ప్రపంచమే ఆధునీకరణ దిశ గా ముందుకు వెళ్తుంటే మన అధికారులు మాత్రం విశ్వవిద్యాలయాన్ని వెనక్కి నెట్టుకొస్తున్నారు, గత రెండు దఫాలుగా విశ్వవిద్యాలయాల ర్యాంకులు చూసుకుంటే క్రింది స్థాయికి పడిపోయింది.

గత మూడు నెలలుగా ఉస్మానియాకు అనుబంధ కళాశాలయైన నిజాం కళాశాల విద్యార్థులు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్స్ ని పునరుద్ధరించాలని సమ్మె చేస్తున్న, వారికి ఎన్నో విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపినా, అధికారుల నుంచి ఏమాత్రం స్పందన లేదు ఇదే కోర్సు మిగతా విశ్వవిద్యాలయాల్లో మాత్రం రెగ్యులర్ కోర్స్  గా వుంది, కానీ మన ఉస్మానియాలో మాత్రం ఈ కోర్స్ ని రద్దు నిర్ణయించింది. గతంలో కూడా ఇలాంటి కొన్ని కోర్సుల్ని రద్దుచేసి తిరిగి పునః ప్రారంభించారు అంటే అధికారులకి కోర్సులు విషయంలో అవగాహన లేదా లేక వారి స్వలాభాలు చూసుకోవడానికి ఏదైనా మార్గాలు వెతుకుతున్నారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదేమని విద్యార్థులు ఎవరైనా అడిగినా నిరసనలు చేపట్టినా చీమ చిటుకుమన్న వాలిపోయే పోలీస్ పటాలాలతో యూనివర్సిటీని తయారు చేశారని విద్యార్థులు వాపోయారు.

విశ్వ విద్యాలయాల సిబ్బంది వ్యవస్థ మొత్తం రాష్ట్రంలోని యూనివర్సిటీలో 80  నుండి  90శాతం వరకు కాంట్రాక్ట్ సిబ్బందితో నే నిండి ఉంది.

మనం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాలు కొరకే 2014లో  రాష్ట్రం ఏర్పాటు  కు ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్టు వ్యవస్థ అనేది వెట్టిచాకిరి వ్యవస్థ అని, కాంట్రాక్ట్ అనే పదం లేకుండా ఆ వ్యవస్థను రద్దుచేసి, కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల కాలంలో జూనియర్, డిగ్రీ లెక్చరర్ల ను మరియు మరికొన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేశారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ సిబ్బంది పై దృష్టి సారించి  రెగ్యులరైజ్ చేయవలసిన అవసరం ఉందని  ప్రస్తుతం మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది అని కాంట్రాక్టు ఉద్యోగులు అన్నారు.

రాష్ట్రంలో ఒకపక్క నిరుద్యోగితను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మన విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం నిర్దాక్షిణ్యంగా ఉన్న సిబ్బందిని తొలగిస్తూ వారి ని నిరుద్యోగులుగా మార్చిన వైనం, గత సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలతో ఇంటిని గడుపుకునే సెక్యూరిటీ గార్డు లు గా పనిచేసిన సిబ్బందిని మొత్తం ఓకే సారి వందల మందిని తొలగించి వారి పొట్ట కొట్టిన ఘనత, వారి స్థానం లో కొత్త సెక్యూరిటీని, పెన్షన్ వస్తున్న వారిని, వారికి ఎక్కువ జీతాలకు  నియమించిన ఘనత కూడా మన ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల దే.  2017 వ సంవత్సరంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా సమస్యలు పరిష్కరించండి బాబూ మమ్మల్ని రెగ్యులర్ చేయండి  సారు, అని మూడు నెలలు పరిపాలన భవనం ముందు నిరవధికంగా టెంట్లు వేసుకొని సమ్మెకు దిగిన కాంట్రాక్టు ఉద్యోగులు,(ఈ సమ్మెకు విద్యార్థి సంఘాలు మరియు ఇతర ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి) వారి సమస్యకి ఇంతవరకు పరిష్కారం దొరకలేదు, దొరుకుతుందా… అనే అనుమానాలకు తావిస్తోంది…,

ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ సిబ్బంది యొక్క లిస్ట్ పంపమని విజ్ఞాపనలు అందినా కూడా, ప్రభుత్వ అధికారుల ఆజ్ఞాపనలు పెడచెవిన పెట్టి, వారి ఆజ్ఞాపన ధిక్కరిస్తున్న వైనం, కాంట్రాక్టు ఉద్యోగుల లిస్ట్ పంపకపోవడం పట్ల  ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వీసీ ఆర్డర్స్ లేవని వారు ప్రిన్సిపల్స్ ఆఫీస్ నుండి నియమింపబడ్డారు అని  అధికారుల నెట్టుకొస్తున్నారు,

ప్రిన్సిపల్స్  మాత్రం ఆర్డర్ కాపీని వీసీ చాంబర్ కు పంపిన కూడా వీసి నుండి రిప్లై రాలేదు అని, వీసీ కావాలనే ఇలా చేస్తున్నారని, గతం లో ఒక విసి, ప్రిన్సిపల్స్ కి కావాల్సిన సిబ్బందిని ప్రిన్సిపల్సే కాంట్రాక్ట్ పద్ధతిన నియమించు కోవచ్చని ఆర్డర్స్ ఇష్యూ చేశారని కాంటాక్ట్ ఉద్యోగ సిబ్బంది తెలిపారు.

ప్రభుత్వము 2014 జూన్ వరకు కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమింపబడ్డ వారందరికీ రెగ్యులర్ చేస్తానన్నారు కానీ విద్యాలయ అధికారులు మాత్రం ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా తమ యొక్క లిస్టు ని ప్రభుత్వానికి పంపకుండా, గత 20, 30  సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని పట్టించుకోకుండా, మా పొట్టన  కొట్టే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, కాంట్రాక్టు ఉద్యోగులు అంటేనే చికాకు తో వ్యవహరిస్తూ, సహోద్యోగులతో కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తారని ఉద్యోగులు తమ బాధను వెలిబుచ్చారు.  గత కాలంలో వీరిని నియమించుకున్న అధికారులు, వారికి అవగాహన లేకుండా నియమించుకున్నారా, లేక ఇప్పుడున్న అధికారులకు అవగాహన లేక నా, వారి మేధోసంపత్తి కి అంతు పట్టడం లేదా, అనేది వారి విజ్ఞతకే వదిలేస్తే,  ఇటీవల టీ ఎస్పీ ఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ లో 300 మంది ఉద్యోగులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అవసరమని ప్రకటన ఇచ్చారు, టీఎస్పీఎస్సీ ద్వారా కొత్తవారిని నియమించి పాతవారిని తొలగిస్తారా, మళ్ళీ కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టన కొట్టే ఆలోచనలో ఉన్నారా…? లేక ఏదైనా అవకతవకలకు పాల్పడే విధంగా ఆలోచిస్తున్నారా…? అని అనేక రకాల ఆలోచనలకు తావిస్తోంది.

ఒక దేశం బాగుపడాలంటే  దేశంలోని అధికారులు మేధావులు మిగతా వారికి సరైన పద్ధతిలో దారి చూపిస్తూ వారి యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహిస్తేనే దేశం బాగుపడుతుంది, ముఖ్యంగా విద్యా వ్యవస్థ బాగుపడితేనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

ఒకే ఒక సమస్య వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది జీవితాలతో ముడిపడి సంవత్సరాలుగా నాన్నతున్న సమస్య సమస్య గానే ఉంది

ఈ విషయంపై ఆలోచించవలసిన అవసరం మేధావి అధికారులకు, మరియు మన ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.

ఇక ఉస్మానియా విశ్వ విద్యాలయం నిధుల విషయానికి వస్తే ప్రభుత్వం  అరకొర నిధులను ఇవ్వడం వల్లనేమో  ఈ మధ్య యూనివర్శిటీ లో కి  వచ్చే వాకర్స్  వద్దనుండి డబ్బులు వసూలు చేసింది (ఎప్పుడూ లేని విధంగా) యూనివర్సిటీ, దీని బట్టి చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిస్థితి  ఏమిటి, ఎటువెల్లి పోతుందో, అనే అనుమానాలకు తావిస్తోంది.

ఈ విషయాలన్నీ పరిగణలోకి  తీసుకొని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం పరిశీలలించవలసిన అవసరం ఎంతైనా వుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్