Sunday, September 8, 2024

రైతు బంధు కావాలా.. రాబందు కావాలా

- Advertisement -

అదిలాబాద్, నవంబర్ 16, (వాయిస్ టుడే ): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ _ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓ పాలసీ ప్రకారం పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి కచ్చితమైన విధానాలతో అన్ని రంగాల్లో విజయం సాధించామన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, ప్రస్తుతం భారతదేశంలో ఆ పరిణతి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ  లను నమ్మితే నట్టేట మునిగినట్టేనని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, అభ్యర్థి చరిత్ర, ఆ పార్టీ చేసిన అభివృద్ధి అన్నీ చూసి పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  2004 లో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇస్తమని చెప్పి పొత్తు పెట్టుకున్నది. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ ఏడాది అటూ ఇటూగా తెలంగాణ ఇవ్వాలె. కానీ 14 ఏండ్లు ప్రజల్ని ఎడిపించారని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా దోఖా చేసి, మోసం చేసి టీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూసిందని ఆరోపించారు. రాజీపడకుండా పులిలాగా కొట్లాడితే విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిండ్రు. వందల మందిని పొట్టన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ తో లక్ష్మి ఉండే జిల్లాగా నిజామాబాద్ జిల్లా ఉండేది. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను ఎండబెట్టారు.

Do you want a relative of a farmer.. Do you want a vulture?
Do you want a relative of a farmer.. Do you want a vulture?

సింగూరు నుంచి నీళ్లు రావాలని అనేక ఉద్యమాలు చేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఏడాది పొడుగునా నిజాం సాగర్ నిండే ఉంటదని హామీనిచ్చారు. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా గతంలో చుక్కా నీళ్లు తేలేదు, ఒక్క పైసా కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా షకీల్ గెలిచిన తర్వాత 72 కోట్ల రూపాయలతో కాలువలను బాగు చేయించారు. షకీల్ కట్టించిన చెక్ డ్యామ్ లతో భూగర్భ జలాలు పెరిగాయి. రైతుల బతుకులు బాగుండాలని బీఆర్ఎస్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది. నీటి తీరువా బకాయిలు మాఫీ చేసి, శాశ్వతంగా రద్దు చేశాం. పెట్టుబడి సాయంగా రైతు బంధును ఇస్తున్నాం, రైతు బీమాతో రైతుల కుటుంబాలకు భద్రతనిస్తున్నం అని కేసీఆర్ పేర్కొన్నారు.గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడన్నా రైతు బంధు పదం విన్నమా? అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలోనే కాదు ఒక్క తెలంగాణలో తప్ప.. దేశంలోనే రైతు బంధు లేదన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీనే స్వయంగా వాళ్లు అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని గుర్తుచేశారు. లంచం ఇవ్వకుండా రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల డబ్బులు ధరణి ద్వారానే డైరెక్ట్ గా వస్తున్నాయని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రానికి చేరతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ వేస్ట్ అంటడు. 3 గంటలు చాలంటడు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ రైతు బంధు వేస్ట్ అనడం కరెక్టేనా అని ప్రశ్నించారు. షకీల్ ఎమ్మెల్యేగా గెలిస్తే రైతు బంధు రూ.16 వేలు అవుతది. కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట కలుస్తది.. రైతు బంధుకు రాంరాం అన్నారు. ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు లేదు. మేం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్ 24 ఏండ్లాయె కొట్లాడబట్టి.. ఇంకెన్నాండ్లు కొట్లాడాలె.. జిందగీల నేనే కొట్లాడాల్నా? ఈసారి మీరే కొట్లాడాలే అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంచిగున్న నిజాంసాగర్ ను ముంచిందే కాంగ్రెస్.. మళ్లీ నిజాంసాగర్ కు పూర్వ వైభవం తెచ్చింది బీఆర్ఎస్ అన్నారు.  బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఒక్క రాష్ట్రం తెలంగాణ. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు పెట్టుకుని నాణ్యమైన విద్య. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరం కలిసి మెలిసి ఉండి పండుగలు చేసుకుంటాం అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్