- Advertisement -
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
Dokka Seethamma is Chief Whip of Government who launched the midday meal scheme
వినుకొండ,
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, గత టిడిపి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ వచ్చాక తొలగించి పేద విద్యార్థుల నోటికాడ కూడు తీశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పథకం తిరిగి అమలు చేసిందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి భోజనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -