కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ముంబాయ్ ఏప్రిల్ 1
Domestic stock markets crashed on the first day of the new financial year
;కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనలతో సెంటిమెంట్ దిబ్బతిన్నది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈద్ సందర్భంగా సోమవారం మార్కెట్లు పని చేయని విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 639.13 పాయింట్లు తగ్గి.. 76,775.79 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 180.25 పాయింట్లు తగ్గి 23,339.10 పాయింట్లకు చేరింది. ప్రస్తుతం సెస్సెక్స్ 1265.12 పాయింట్లు తగ్గి.. 76149.80 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇక నిఫ్టీ 322.65 పాయింట్లు తగ్గి.. 23,196.70 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతికార టారిఫ్‌లపై బుధవారం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.అదే సమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ షేర్ల అమ్మకాలతో మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక చముర ధర పెరగడం కూడా ఓ కారణం. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.51 శాతం పెరిగి 74.74 డాలర్లకు చేరుకుంది. భారత్ చమురు దిగుమతులపై ఆధారపతుండడగా.. చమురు ధరల పెరుగుదల మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. శుక్రవారం రూ.4352.82 కోట్ల విలువ షేర్లను విక్రయించారు. ఇక ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం పడే అవకాశం ఉందని గోల్ట్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కో, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ట్రెంట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాల్లో కొనసాగుతున్నాయి.