- Advertisement -
శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళం
Donated 15 electric two-wheelers to Srivara
తిరుమల,
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సి.వెంకట నాగరాజ శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని దాత తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
- Advertisement -