కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మవద్దు

- Advertisement -

కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మవద్దు
రంగారెడ్డి
బూటకహామీలనుఇచ్చిగద్దె నెక్కిన కాంగ్రెస్ ను నమ్మొద్దు అని బీజేపీపార్లమెంట్ అభ్యర్ది కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో బీజేపీ ఆశిర్వాద యాత్రలో అయన పాల్గోన్నారు. కొండా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేర్చింది లేదు. గ్రామాలలో నిత్యం కరెంటు ఉండడం లేదు. ఇప్పటివరకు పెన్షన్లు ఇవ్వడం లేదంటూ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈసారి భారీ మెజార్టీతో బిజెపి 15 సీట్లు గెలుస్తుందని అన్నారు. ధరణి వల్ల భూ సమస్యలు ఇప్పటికి తీరక చాలామంది కోట్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. శంషాబాద్ మండలం ముచింతల్ పెద్దతుప్రతండా ఆలీ కోల్ తండా చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ అమిదుల్ల నగర్ లో బిజెపి ఆశీర్వాదయాత్ర మొదలైంది. గ్రామ గ్రామాన ప్రజలు కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మంగళహారతులిస్తూ స్వాగతం పలికారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ధరణి ఎత్తివేస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది కానీ మూడు నెలలైనా దాన్ని ధరణి పూసేతకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular