Sunday, September 8, 2024

అందుబాటులో ఉండి అభివృద్ధి చేసిన వారిని యాది మరువకండి: పద్మారావు

- Advertisement -

కారు గుర్తుకు ఓటువేసి గెలిపించండి

ఓటర్లకు పద్మారావు గౌడ్ విజ్ఞప్తి

సికింద్రాబాద్ లో భారీగా బైక్ ర్యాలీలు

సికింద్రాబాద్, నవంబరు 28:  సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్దికి చిరునామాగా మార్చి, ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు వారి అవసరాలను నిరంతరం తీర్చుతున్నామని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలు జరిగాయి.   డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువ నేతలు కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, సీనియర్ నేతలు మోతే శోభన్ రెడ్డి,  కరాటే రాజు, కంది నారాయణ,  లింగాని శ్రీనివాస్ లతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు   ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు.  తొలుత సితాఫలమండీ నుంచి బైక్ ర్యాలీని  పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 50 సంవత్సరాల్లో చెప్పట్టని ఎన్నో పనులను కేవలం గడచిన పదేళ్ళ  వ్యవధిలోనే చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారం, మున్సిపల్ మంత్రి, బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు   ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో  అభివృద్దిలో  సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ప్రధమ స్థానంలో  నిలుపుతున్నామని తెలిపారు. 50 సంవత్సరాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, నాయకుల వాగ్దానలకే మితంగా నిలిచిన తుకారాం గేటు RUB నిర్మాణం పనులు దాదాపు 72 కోట్ల రూపాయల నిధులను వినియోగించి నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి రూ.30 కోట్ల ప్రత్యేక నిధులతో  సితఫలమండీలో ప్రభుత్వ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీ కొత్త భవనాలను నిర్మించే పనులు చురుకుగా సాగుతున్నాయని,  సికింద్రాబాద్ లో జూనియర్, డిగ్రీ కాలేజిలు  లేని లోటును  తీర్చి, 50 ఏళ్ళ స్థానికుల కలను   నేరవేర్చడంతో పాటు  కొత్త భవనాల నిర్మాణం పనులు కూడా చేపట్టడం విశేషమని తెలిపారు. అదే విధంగా సికింద్రాబాద్ పరిధిలో 10 స్కూల్ లను ఎంపిక చేసి రూ.50 లక్షల చొప్పున నిధులతో సదుపాయాలు కల్పిస్తిన్నామని, అడ్డగుట్ట, జమే ఉస్మానియా, లాలాపేట ప్రభుత్వ స్కూల్ లలో సదుపాయాల మెరుగుకు, తరగతి గదుల నిర్మాణం, ఇతరత్రా సదుపాయాలకు  రూ.3  కోట్ల నిధులను మంజూరు చేయడంతో పాటు తన సొంత నిధులతో పలు స్కూల్ లలో విద్యార్ధులతో పుస్తకాలు, కంప్యుటర్ లను సమకూర్చామని తెలిపారు. పేద, మధ్య తరగతుల వారికి సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతోందని,  లాలాపేట, అడ్డగుట్టలో మరో రెండు ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అందరికి ఉపాధి అవకాశాలు కల్పించే సెట్విన్ శిక్షణా కేంద్రం  సితాఫలమండీ లో స్థాపించామని, సికింద్రాబాద్ పరిధిలోని యువతీ యువకులే కాకుండా సనత్ నగర్, మల్కాజిగిరి, కంటోన్మెంట్, ముషీరాబాద్ నుంచి రోజూ పెద్ద సంఖలో యువత దీనిని వినియోగించుకుంటున్నారని తెలిపారు.

Don't forget those who are available and developed: Padma Rao
Don’t forget those who are available and developed: Padma Rao

8 జాబ్ మేళా ల ద్వారా 35 వందల మందికి ఉపాధి కల్పించమని తెలిపారు. లాలపేట్  వద్ద రూ.4 కోట్లతో కొత్త కల్వర్టు, ఫ్రైడే మార్కెట్, మహమ్మద్ గుడా, ఎల్ నారాయణ నగర్ ప్రాంతాల్లో రూ.2.5 కోట్ల ఖర్చుతో  కల్వర్టు లు నిర్మించామని, తద్వారా భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో కూడా ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. దాదాపు 70 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో లాలాపేట  రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని, 50 ఏళ్ళుగా చేపట్టలేని పనుల్లో ఇదొకటని వివరించారు.  సికింద్రాబాద్ లో స్విమ్మింగ్ పూల్ లేని లోటును తీర్చి రూ.6 కోట్ల ఖర్చుతో లాలాపేట స్విమ్మింగ్ పూల్ పనులను ప్రారంభించామని  త్వరలో ప్రారంభానికి సిద్దంగా ఉందని తెలిపారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో GHMC ద్వారా రూ.275 కోట్ల ఖర్చుతో ఆయిదు డివిజన్లలలో వివిధ అభివృధి పనులను గడచిన పదేళ్ళ లో  చేపట్టాము. వాటిలో ప్రధానంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కౌసర్ మసీదు నాలా,  ఇందిరా నగర్ (సీతాఫల్ మండి), పుల్లయ్య గల్లీ.  శాంతి నగర్,  బ్రాహ్మణ బస్తీ నాలాలను పునర్నిర్మించామని, శాంతి నగర్ మోడల్ మార్కెట్,  ఆలుగడ్డ బావి  రోడ్ సైడ్  మార్కెట్ ప్రజలకు అందుబాటులో కి   వచ్చాయని తెలిపారు.  సితాఫలమండీ కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి, సితాఫలమండీ అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రులకు  కొత్త భవన సముదాయాన్ని రూ.11.30 కోట్ల ఖర్చుతో చేపట్టే పనులు శరవేగంగా సాగుతున్నాయని లాలాపేట లో రూ.13.05 కోట్లు, అడ్డగుట్ట లో రూ.13.05 కోట్ల ఖర్చుతో రెండు ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను  ప్రారంభించామని తెలిపారు. స్థానికుల అభీష్టం మేరకుమాణికేశ్వరి నగర్ లో కుడా ఆసుపత్రి ఏర్పాటునకు ప్రభుత్వం నుంచి అనుమతిని  సాధించామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో రవీంద్రనగర్, చింతబావి, దుడ్ బావి, ఇందిరానగర్, అంబర్ నగర్మ తర్నాకల్లో బస్తీ దవాఖానాలను   ఏర్పాటు చేశామని తెలిపారు. 9 హిందూ శ్మశాన వాటికలు,  ముస్లిం కబరస్తాన్లు,   1 క్రిస్టియన్ శ్మశాన వాటిక అభివృద్దిని చేపట్టామని, జంట నగరాలలోనే మోడల్ ఈద్గా గా చిలకలగుడా ఈద్గా తయారైందని తెలిపారు.

తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద FOB ని ప్రారంభించామని, ఆలుడ్డబావి వద్ద FOB ఏర్పాటు ప్రతిపాదించామని పద్మారావు గౌడ్ వివరించారు. పార్కుల అభివృధి, క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని,   ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనం కేంద్రాలు చిలకలగూడ, బౌధనగర్, మనికేశ్వరి నగర్, అడ్డగుట్ట్లలో ప్రారంభించామని, సికింద్రాబాద్ కు నేరుగా కృష్ణా జలాల తరలింపు ప్రాజెక్ట్, ఇన్ లేట్/ఔట్ లెట్ లతో కలిపి రూ. 6 కోట్లతో  శాంతి తార్నాక రిజర్వాయర్  (9.27 కోట్లు), మారేడ్ పల్లి రిజర్వాయర్ (12 కోట్లు (ప్రాజెక్ట్ లు  పూర్తయి అందుబాటులోకి   వచ్చాయి)  అదే విధంగా దశాబ్దాలుగా మంచి నీటి ఎద్దడి, సివరేజ్ సమస్యలను ఎదుర్కొన్న సికింద్రాబాద్ ప్రజలకు ఆయా సమస్యల నుంచి శాశ్వత విముక్తిని కల్పించామని తెలిపారు. రికార్డు సంఖ్యలో 190 పవర్ బోరింగ్ లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 21 వేల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని, కళ్యాణ లక్ష్మి, శాదిముబరక్, CMRF  చెక్కులను  నేరుగా లబ్దిదారుల ఇళ్ళ వద్దే అందిస్తున్నామని తెలిపారు. 750 మందికి  KCR కిట్స్ అందించామని, ప్రస్తుత సంవత్సరంలో రూ. 20. 32 కోట్ల మేరకు రుణాలను పొదుపు సంఘాలకు అందించామని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద రోగులకు వైద్య ఖర్చుల నిధులను అందించామని . సుమారు 3100 మందికి రూ. 29 కోట్ల మేరకు నిధులను అందించామని తెలిపారు. సికింద్రాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నము. రూ.2.25కోట్ల నిధులతో చిలకలగుడా, తుకరంగేటు, లాలాగూడ, ఉస్మానియా యునివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో సీ సీ కెమరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రజల అవసరాలు, శాంతి భద్రతల పరిరక్షనను దృష్టిలో ఉంచుకొని చిలకలగుడా పోలీసు స్టేషన్ పరిధిలో వారసిగుడా లో కొత్తగా  పోలీస్ స్టేషన్ ను  ఏర్పాటు  చేశామని తెలిపారు. షీ టీం లను కూడా అన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కలగా మారిన ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ కు చెందిన 2770 మందికి ఇప్పటికే అహ్మద్ గుడా, జవహర్ నగర్, మరహరి పల్లి  ప్రాంతాల్లో లాటరీ ద్వారా అత్యంత పారదర్శాక్  విధానంలో పూర్తి ఉచితంగా 2 bhk డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించామని తెలిపారు. బోనాలు వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని 210 దేవాలయాలకు రూ.1.98 కోట్ల మేరకు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వ అందించిందని, తెలంగాణా ఆవిర్భావం తరువాత అన్ని మతాల పండుగలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.  గంగా జమునా తహాజీబ్ గా పరిగణిస్తూ దసరా పండుగకు బతుకమ్మ చీరలు, రంజాన్ పండుగా కు దుస్తుల తోఫా లు, క్రిస్మస్ కు గిఫ్ట్ లను అందించే సంప్రదాయం పాటిస్తున్నామని తెలిపారు. కరోనా మహామ్మరితో యావత్ ప్రపంచం తల్లడిల్లి దేశవ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిన రోజుల్లో కూడా తాము, తమ కార్యాలయం, తమ కార్యకర్తలు శ్రమించారని, ప్రజలను అడుకున్నారని తెలిపారు. సికింద్రాబాద్ లోని 15,500  కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర కిట్లను అందించామని, ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడి పోయే పరిస్థితుల్లో 60 ఆక్సిజన్ సిలిండర్ లను తన సొంత డబ్బుతో సమకూర్చుకొని వాటిని ఉచితంగా 400 మంది రోగులకు  అందించామని, కరోనా రోగుల ప్రాణాలను రక్షించే రేమిడిస్విర్ ఇంజక్షన్ కొరత ఏర్పడిన దశలో తన సొంత డబ్బులతో దశల వారీగా 550 ఇంజక్షన్ కిట్లను కొనుగోలు చేసి అవసరమైన రోగులకు అందించామని తెలిపారు. అప్పట్లో లాక్ డౌన్ వల్ల చిక్కుపోయిన్ వారికీ, స్వస్థలాలకు వెళ్ళాల్సిన వారికీ ఉరటను కల్పించి సుమారు 640 మందికి లాక్ డౌన్ పర్మిషన్ పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు జరిపామని తెలిపారు.  రైల్వే ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలు, వ్యాక్సిన కేంద్రం ఏర్పాటుకు అప్పటి వైద్య శాఖా మంత్రిని, అధికారులను సంప్రదించి లాలాగుడా రైల్వే ఆసుపత్రిలో సైతం ఈ సదుపాయాలు  కల్పించామని, వేలాది మంది రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, పించనర్లు  ప్రయోజనం పొందారని తెలిపారు. తమకు మద్దతు తెలిపి ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు సహకరించాలని కోరారు. బీఆర్ ఎస్ అధినేత  కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు ఉపకరించనుందని, ప్రధానంగా ఆసరా పించను మొత్తాల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు, మహిళకు ఆర్ధిక సదుపాయం వంటి అంశాల వల్ల  అందరికీ మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

పద్మారావు కే ఎం ఆర్ పీ ఎస్ మద్దతు

బౌద్దనగర్ డివిజన్ ఎం ఆర్ పీ ఎస్ నాయకుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ను కలిసి తమ మద్దతును ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్