Sunday, September 8, 2024

మిమ్మల్ని విడిచి వెళ్లాలంటే బాధ ఉంది: సీపీ  ఏవీ రంగనాధ్

- Advertisement -

నాకు మళ్లీ అవకాశం వస్తే ఇక్కడ పనిచేయాలనుంది

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన బదిలీపై వెల్తున్న వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాధ్ కు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని అన్నారు. ఈ ఎన్నికల సమయంలో అందరితో కలివిడిగా ఉండే సీపీ రంగనాధ్ బదిలీకావటం కొంత ఇబ్బందిగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు సంబంధించిన డబ్బులు చిట్ ఫండ్ నుండి ఇప్పుంచేందుకు సీపీ చేసిన కృషిని గుర్తుచేశారు. ఈసందర్బంగా ముఖ్యఅతిధిగా హజరైన సీపీ రంగనాధ్ మాట్లాడుతూ

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని, వరంగల్ లో ప్రజలతో, మీడియా తో చాలా సింక్ అయ్యానని చెప్పారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని,  వాటి పరిష్కారంలో నేను  ప్రజలకు దగ్గరయ్యానని అన్నారు.

dont-leave-if-officials-make-mistakes-cp-av-ranganath
dont-leave-if-officials-make-mistakes-cp-av-ranganath

పేదలకు, బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీ తో తాను పనిచేస్తానని, బలహీనంగా ఉన్న వాడిని బలవంతుడి నుండి కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లాండ్ ఆర్డర్ లో భాగంగా ఉంటుందన్నారు. ఉదయం 7గంటల నుండి రాత్రి11గంటలు ప్రజల  సమస్యలు, అధికారులతో ఫోన్ మాట్లాడిన రోజులు అనేకం ఉన్నాయని, మాభూమి సినిమా చిన్నప్పుడు చూసానని,ఇక్కడికి వచ్చాక మరో 2-3 సార్లు చూసానని గుర్తుచేసుకున్నారు. ఇక్కడ నిజ జీవితంలో భూ సమస్యలు చాలా చూసానని, భూ సమస్యలు చాలా బాధాకరమని, భూమికోసం ఎక్కడిదాకైనా కోట్లాడతారని,భూమికి మనిషికి మధ్య ఎమోషన్ ఉంటుందని చెప్పిన సీపీ వరంగల్ మీడియా చాలా సపోర్ట్ గా ఉండేదని అన్నారు.

అధికారులు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. పవర్ ఉందని ఏదిపడితే అది చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నారు.  అన్యాయానికి చెక్ పెట్టాలని, లేకంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

వరంగల్ పని చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి రాజకీయ నాయకులు చాలా సపోర్ట్ చేశారని, మా అధికారులు పనితీరు బాగుందని కిదాబునిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఎక్కడైనా తప్పుడు కేసులు పెడితే సహించానని, మర్డర్ కేసులో తప్పు చేయని వారికి శిక్ష పడితే పరిస్థితి ఏంటి ? వారి కుటుంబం ఆగం కావాల్సిందే కదా, అందుకే తప్పుడు కేసుల విషయంలో తాను బాధితులకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. వివాదాల్లో పోలీసు అధికారులు వేలు పెట్టినా వదలలేదని, వారిపై కూడా చర్యలు తీసుకున్నానని అన్నారు.  నాకు మళ్లీ అవకాశం వస్తే ఇక్కడ పనిచేయాలనుందని, ఇక్కడి ప్రజలు మంచివారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ పోలిస్ కమిషనర్ దాసరి మురళీధర్ , ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య,  ట్రెజరర్ బొల్ల అమర్, క్లబ్ కార్యవర్గం, జర్నలిస్ట్ సంఘాల నేతలు దాసరి కృష్ణారెడ్డి, బీఆర్  లేనిన్ , గాడిపల్లి మధు, బొక్క దయాసాగర్, ఆర్వీ ప్రసాద్, సీనీయర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, ఫొటో-వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. హనుమకొండ ఏసీపీ కిరణ్ , సుబేదారి ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్‌ఐ సుమన్ తదితరులు హజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్