రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు ..దొండపాటి రమేష్….
Don't see tears in the eyes of the farmers..Dondapati Ramesh....
ఖమ్మం
వ్యవసాయంలొ రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టనీకుండా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు రాత్రి పరిటాల భద్రయ్య అధ్యక్షతన జరిగిన చిన్న మునగాల గ్రామ శాఖ రైతు సంఘం మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు చాలామంది రైతులు పట్టాలు రాక సాదా కాగితాల మీదనే ఉన్నారని ప్రభుత్వం తక్షణమే భూ సమగ్ర సర్వే నిర్వహించి సాదాభైనాల ద్వారా భూమి సాగులో ఉండి పంటలు పండించుకున్న రైతులకు పట్టా పుస్తకాలు ఇవ్వాలని వారు కోరారు పంటలు నిలవ కోసం గ్రామాల్లో గోదాములు నిర్మించాలని పంట పొలాలకు పోవుటకు రహదారులు అభివృద్ధి చేయాలని సహకార సంఘాల ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఆరోగ్య భద్రతకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారుఈ మహాసభలో రైతు సంఘ నాయకులు పాప కంటి సుదర్శన్ మోహన్ రావు జయరాజు నాగవరపు భద్రయ్య రమేష్ రాజారత్నం తదితరులు పాల్గొన్నారు చిన్న మునగాల రైతు సంఘం అధ్యక్షులుగా పాప కంటి సోంసన్ కార్యదర్శిగా పరిటాల భద్రయ్య తో పాటు 11 మందిని కమిటీ సభ్యులుగా మహాసభ లో ఎన్నుకున్నారు