ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దు..
Don't sell grain at low rate..
ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందండి
మంత్రి నాదెండ్ల మనోహర్
కృష్ణాజిల్లా పామర్రు నియోజవర్గం
కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాశులను పరిశీలించి, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్
. రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేసామన్నారు
తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు..
తేమ శాతం లో కూడా సడలింపు చేశామని 24% శాతం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే ల ద్వారా అమ్ముకోవచ్చని రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరి చేస్తామని తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మరియు పౌర సరఫరా అధికారి ఆర్డీవో మరియు తాసిల్దార్ పాల్గొన్నారు