- Advertisement -
గోశాలలో ఆవులు వద్దు… రైతుల వద్ద ఉండడం ముద్దు
Don't want cows in cowsheds... Staying with farmers is good
దేవాదాయ గోశాలలో ఉన్న ఆవులను ఉచితంగా 3 వేల వరకు పంపిణీ
రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్
హైదరాబాద్ డిసెంబర్ 14
గోశాలలో ఆవులు వద్దు… రైతుల వద్ద ఉండడం ముద్దు అన్న నినాదం తో రైతు సంక్షేమ సేవా సంఘం ఒక సంవత్సరం కాలం నుండి దేవాదాయ గోశాలలో ఉన్న ఆవులను ఉచితంగా మూడు వేల వరకు పంపిణీ చేసినట్లు రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. గోశాలల ఉన్న ఆవులకు సరైన ఆహారం లేదు కాబట్టి అవి రైతుల దగ్గర ఉంటే సుఖపడతాయని దేవాదాయ యాజమాన్యాన్ని మెప్పించి ఒప్పించి రైతులకు ఇప్పించడానికి అహర్నిశలు రైతు సంక్షేమ సేవ సంఘం కృషి చేస్తుందన్నారు ఇప్పటివరకు వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం నుండి పెద్ద మొత్తంలో ఆవులను ఇప్పియడం జరిగింది ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ అలాగే ఇంకా వేరే దేవా స్థానంలో ఉన్న ఆవులను కూడా రైతులకు ఇవ్వాలని దేవాదాయ ధర్మాదాయ మంత్రివర్యులు కొండ సురేఖ మరియు రాష్ట్ర కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని ప్రేమ్సాగర్ యాదవ్ తెలిపారు. అలాగే ప్రైవేట్ గోశాలల ఉన్న ఆవులను కూడా రైతులకు ఇవ్వాలని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులను కూడా పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఆ తీర్పు రాగానే ప్రైవేట్ గోశాలలో ఉన్న ఆవులను కూడా రైతులకు ఇచ్చేలా కృషి చేస్తామని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ఆవులు గోశాలలో ఉండవద్దు రైతుల వద్ద ఉండడం ముద్దు సమాజం బాగుండాలన్న ఆరోగ్యం బాగుండాలన్న ఆవులు పకృతిలో మమేకమై నేల మీద తిరుగుతూ నేల మీద నడుస్తూ సమాజానికి ఆవు ప్రయోజనాలు అన్ని అందాలని మేము ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఇందులో ప్రతి ఒక్కరు గోసంరక్షణ గురించి అందరూ కృషి చేయాలని రైతు సంక్షేమ సేవా సంఘం అందరికీ మనవి చేస్తున్నారు గోసంరక్షణ భూసంరక్షణ వన సంరక్షణ ధ్యేయంగా అందరూ ముందుకు రావాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు
- Advertisement -