ఆహారాన్ని వృధా చేయకండి పేదల ఆకలి తీర్చండి
Don't waste food feed the hunger of the poor
పెదకూరపాడు,జనవరి 8
ఆహారాన్ని వృధా చేయకండి పేదలి ఆకలి తీర్చండని కలియుగంలో అన్నదానమే మోక్షానికి మార్గమని జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు. పెదకూరపాడుకు చెందిన బాలినేని రామయ్య ఇంటివద్ద జరిగిన ఫంక్షన్ లో భోజనం మిగిలిన విషయాన్ని డాక్టర్ శ్రీనివాస్ జన చైతన్య సమితి వారికి తెల్పటంతో సంస్థ ప్రతినిధులు ఆహారాన్ని సేకరించి స్థానిక ముగ్గురు రాజుల తిరుణాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి (బూరలు,బొమ్మలు అమ్ముకునేవారితో పాటు చిరు వ్యాపారులు వివిధ ప్రాంతాలనుంచి) తిరునాళ్లకు వచ్చిన వారికి అన్నదానాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు మాట్లాడుతూ డబ్బులున్న ఆహారం అందుబాటులో లేక ఎంతోమంది పస్తులు ఉండే పరిస్థితి ఇలాంటి సమయంలో అలాంటివారికి భోజనం పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో గుడిపూడి అఖిల్ తదితరులు ఉన్నారు.