వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గెలుపు కోసం కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 6, 7, 31, 50, 51, 60 డివిజన్లో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు పారిశ్రేణులతో కలసి ఆయన డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపుతున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమీ ఏజెండాగా పని చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారని ఆయన అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా కావలసినంత అభివృద్ధి జరుగుతుందని ఈ ఎన్నికలలో ప్రజలు వినయ్ భాస్కర్ కు ఓటేసి గెలిపిస్తారన్న విశ్వాసాన్ని సుందర్ రావ్ యాదవ్ వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన ఆరు డివిజన్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీ విధానాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కూడా చైర్మన్ అన్నారు. తన డివిజన్లో మెజారిటీ ఓట్లను పొందటం ఖాయమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి,బిజెపి అభ్యర్థి రావు పద్మ తో ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు పట్ల ప్రజలుసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను పట్టణ ప్రజల సంక్షేమం కోసం చేపట్టి నిర్వహించారని ఆయన అన్నారు.ప్రచారంలో ఆయన వెంట ఆయా డివిజన్ లా నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




