డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ప్రజలందరూ కృషి చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
Dr.B.R. All people should work towards the realization of Ambedkar's aspirationsవిజయవాడ
సామాజిక అసమానతల నిర్మూలనకు డా.బి.ఆర్ అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేయటమే కాకుండా, అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవం, సమానత్వం, స్వేచ్ఛ స్వాతంత్రం జీవించాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రూపొందించాడని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు..
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 68 వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితమే రాజ్యాంగం ద్వారా భారత దేశ గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పిన మహా మనిషి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు.ఈ నెల 13,14 వ తేదీల్లో పార్లమెంట్ లోక్ సభలో రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా చర్చ జరగనుందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశాభివృద్దికి ఎన్నో సలహాలు, సూచనలు అందించి దేశ ప్రగతికి దోహదపడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, ఆయన ఆలోచనలు,ఆశయాల దిశగా ప్రజలందరూ కృషి చేయాలని ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ వర్మ,4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు జి.వి.నరసింహారావు, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శికొట్టేటి హనుమంతురావు , టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ (దళిత రత్న), జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె.కరీముల్లా, మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున యాదవ్, తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవరపల్లి ఆంజనేయులు, అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎమ్.డి.ఇర్ఫాన్ , వాసవీ క్లబ్ మోహన్ రావు, గౌడ సాధికార సంఘం జిల్లా అధ్యక్షులు పామర్తి కిషోర్ బాబు, 7వ డివిజన్ టిడిపి ప్రెసిడెంట్ పటమట సతీష్, తూర్పు వాణిజ్య విభాగ జనరల్ సెక్రటరీ పెనుగొండ శ్రీనివాస్, టిడిపి నాయకుల డాక్టర్ సంకె విశ్వనాథం, అబీద్ హుస్సెన్, జై భీమ్ ఆర్మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.నరసింహారావు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.




