Sunday, September 8, 2024

తడిసి.. మోపుడవుతున్న ఎన్నికల ఖర్చు

- Advertisement -

వరంగల్, నవంబర్ 21, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు, కండువాలు, డోర్ పోస్టర్లతో అభ్యర్థులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. దీంతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు భోజనం, మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ కూడా తప్పటం లేదు.దీంతో ఒక్కో అభ్యర్థి ఒక రోజుకే రూ.20 నుంచి రూ.50 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.40 లక్షల లోపే ఉండాలని ప్రచార పరిమితిని విధించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఒక్కో అభ్యర్థికి రూ.40లక్షల పార్టీ ఫండ్ చెక్కులను అందజేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులకు పార్టీ ఫండు ఇస్తున్నా, పెరిగిన ప్రచార వ్యయానికి అనుగుణంగా నిధులు సరిపోవడం లేదు.ప్రధాన రాజకీయ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవుతున్న వ్యయాన్ని భరించలేమని చేతులెత్తేస్తున్నారు. ఉద్యమకారుల కోటాలో పార్టీ టికెట్లు దక్కిన అభ్యర్థులు, రిజర్వుడు స్థానాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయం భరించడం కష్టంగా మారింది. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధుల కోసం కొందరు అభ్యర్థులు ఆస్తులను సైతం అమ్ముకుంటున్నారు.కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయాన్ని భరించడం కోసం హైదరాబాద్ నగరంలో ఉన్న భూములను అమ్ముకున్నారని సమాచారం. పలువురు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం తమ ఆస్తులను తెగనమ్ముకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. మరో వైపు కొందరు అభ్యర్థులు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఫామ్ హౌస్ లను తనఖా పెట్టి డబ్బులు సమకూర్చుకుంటున్నారని సమాచారం.మరికొందరు ఎన్నారై స్నేహితుల నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నారని అంటున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ప్రచార రథాల ఖర్చు అనూహ్యంగా పెరిగింది. డీజే సౌండు బాక్సులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొనే వాహనచోదకులు, కార్లు,ఆటోలు, బైకులకు పెట్రోలు, డీజిల్ కూడా అభ్యర్థులు పోయిస్తున్నారు. వార్డుల వారీగా రోజుకు 10వేల చొప్పున కార్యకర్తలకు ఇవ్వాల్సి రావడంతో నియోజకవర్గంలో రోజుకు ఖర్చ 20 లక్షల రూపాయలు దాటుతుందని చెబుతున్నారు.ఫంక్షన్ హాళ్లు కిరాయికి తీసుకొని వంటవాళ్లతో వంట చేయించి కార్యకర్తలకు రెండు పూటలా భోజనం పెడుతున్నారు. దీనికి తోడు ఈ నెల కార్తీక మాసం కావడంతో కులాల వారీగా కార్తీక వన సమారాధన పేరిట వన భోజనాల కార్యక్రమాన్ని అభ్యర్థులే భరిస్తున్నారు. వనభోజనాల కార్యక్రమాల్లో ప్రచారం చేయడం ద్వారా ఓట్ల వేట సాగిస్తున్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో డప్పులు, టపాసులు, పూలదండలు, డీజే సౌండు, ఇంటింటికి కార్యకర్తలను పంపించి ప్రచారం సాగించడం లాంటికి అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి వస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్