- Advertisement -
భారీ వర్షానికి తిప్పారెడ్డిపల్లె గ్రామంలో కూలిన మట్టి మిద్దె
Due to the heavy rain, the mud pit collapsed in Tippareddypalle village
రుద్రవరం,
మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టిమిద్దే కూలింది. గ్రామానికి చెందిన మద్దూరు వెంకటమ్మ తన మనవరాళ్లతో తనకున్న మట్టిమిద్దెలో జీవనం సాగిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన మట్టి మిద్దె కావడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగ నాని మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అధికారులు కూలిన మట్టి మిద్దెను పరిశీలించి బాధితురాలకు తగిన ఆర్థికసహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -