Friday, November 22, 2024

ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

- Advertisement -

దసరా శరన్నవరాత్రులకు సకల ఏర్పాట్లు

విజయవాడ:  ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రుల కు అధికారులు, పాలక మండలి సభ్యులు సర్వం సిద్దం చేసారు. దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ దసరా లో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసాం. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తాం. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వుంటాయని అన్నారు. అక్టోబర్ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ  దర్శనమివ్వనున్నారు. 16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19 న  శ్రీ మహాచండీ దేవి అలంకారం, 20 న  శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం), మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు.

Dussehra Sharannavaratri Mahotsavs from October 15 to 23 on Indrakiladri
Dussehra Sharannavaratri Mahotsavs from October 15 to 23 on Indrakiladri

తరువాత 21 న శ్రీ లలితా త్రిపురసుందరీ  అలంకారం, 22 న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23 న శ్రీ మహిషాసురమర్ధనీ దేవిఅలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం వుంటుంది. 200 మంది ఇతర దేవాలయాల నుంచీ సిబ్బంది వస్తారు. అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారు. కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుందని అన్నారు.

ఇంద్రకీలాదరి ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవుతాయి. ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయి. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం. జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నాం. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు.వుంటాయి. వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం. బడ్జెట్ 7 కోట్లు.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆశిస్తున్నాం. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్