ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష
Early screening can protect against cancer
శిరివెళ్ళ
మంగళవారం నాడు మండల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తల చే డాక్టర్ ముకేశ్ మరియు సి హెచ్ ఓ రామ్మోహన్ రెడ్డి క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి ముఖేష్ మాట్లాడుతూ మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ ప్రమాదకరమైన అంశాలపై దూరంగా ఉండాలని సూచించారు.
మంచి పోషకాహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
వీలైనంత ఎక్కువ కాలం తల్లి పాలను తీసుకోవడం వలన క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తెలిపారు.
ధూమపానము ఆల్కహాలు బహుళలైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
సిహెచ్ ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ దినం జరుపుకుంటామని తెలిపారు
క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే నియంత్రణ సాధ్యమని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సరు వ్యాధి 2వ కారణమని తెలిపారు.
ప్రతి ఐదు క్యాన్సర్ మరణాలకు స్మోకింగ్ ముఖ్య కారణమని ఒక్క స్మోకింగ్ 15 రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది అని తెలిపారు.
బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మరియు 14 రోజులకు మించి రోగ లక్షణాలు తగ్గకపోతే డాక్టర్లచే పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి
ఏటా ఒక కోటి క్యాన్సర్ రోగులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయని, ఇండియాలో ఏటా 11 లక్షలు మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపారు.
క్యాన్సర్లు అనేక రకాలు ఉన్నాయని క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన సరిగా లేదని క్యాన్సర్ కు వ్యతిరేకంగా, క్యాన్సర్ రహిత భవిష్యత్తు అనే ఉమ్మడి లక్ష్యంతో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో
పి హెచ్. ఎన్.సరస్వతి సూపర్వైజర్ సుభాషిని ఎం. ఎల్. హెచ్. పి. సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు