తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

Earthquakes in Telugu states

హైదరాబాద్, డిసెంబర్ 4, (వాయిస్ టుడే)
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగ్గయ్యపేట, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, మంగళగిరి, చెన్నూరు, జైపూర్ మండలం, మంచిర్యాల, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో 2 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.మరోవైపు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. అటు నందిగామలో 7 సెకన్ల పాటు భూమి కంపించగా.. గుడివాడలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. సుమారు ఉదయం 7.20 నుంచి 7.26 మధ్య పలుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. అత్యధికంగా ములుగు జిల్లా మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. గోదావరి రివర్‌ బెడ్‌లో కూడా ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, తెలంగాణలో 20ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు రావడం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular