Sunday, September 8, 2024

ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన

- Advertisement -

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన

EC notification for electoral voter registration

అమరావతి: తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్ కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్