Tuesday, January 14, 2025

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు?

- Advertisement -

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు?

ED notices to former minister KTR?

జనవరి 7న విచారణకు రండి

హైదరాబాద్

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది శనివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎం డీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి,లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులో పేర్కొంది.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారం గా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ. ఎఫ్ ఈ ఓ, కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకత వకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటి కే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగించ వచ్చని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు. కేసు విచార ణను మంగళ వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా. విచారణ ను మంగళ వారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటిం చారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్