Sunday, September 8, 2024

బై జూస్ కు ఈడీ షాక్…

- Advertisement -

న్యూఢిల్లీ, నవంబర్ 22, (వాయిస్ టుడే):  అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కష్టాల్లో ఉన్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించి  రూ.9000 కోట్లు విదేశాలకు తరలించిందని భావిస్తూ బైజూస్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇదే విషయాన్ని బైజూస్ కు పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం వైరల్ కావడంతో ఈడీ నోటీసులపై బైజూస్ స్పందించింది. ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని బైజూస్ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. FEMA నిబంధనల ఉల్లంఘనపై బైజూస్ సంస్థకు ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. బైజూస్ సంస్థకు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ నోటీసులు పంపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దాని ప్రకారం.. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్  సంస్థతో పాటు వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ కు ఈడీ నోటీసులు పంపింది. ఈడీ నోటీసుల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఇదివరకే బెంగళూరులోని కంపెనీకి చెందిన 3 చోట్ల తనిఖీలు చేసింది. ఆ సమయంలో ఈడీ రవీంద్రన్ తో పాటు సంస్థకు చెందిన కొంత డేటాను సేకరించిందని రిపోర్టులు వచ్చాయి. 2011 నుంచి 2023 మధ్య దాదాపు 12 ఏళ్ల సయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో బైజూస్ సంస్థ రూ.28 వేల కోట్లు అందుకుందని ఈడీ వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఆ సమయంలోనే ఎడ్ టెక్ కంపెనీ రూ.9,754 కోట్లను  ఎఫ్.డీ.ఐ రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌, బైజూస్‌ పేరెంట్ కంపెనీ అయిన థింక్ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కు చెందిన కొన్నిచోట్ల ఈడీ సోదాలు జరిపింది. తాజాగా బైజూస్ కంపెనీతో పాటు వ్యవస్థాపకుడు  రవీంద్రన్ కు ఈడీ నోటీసులు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది.కాగా, బైజూస్ కొన్ని నెలల నుంచి ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తూ వస్తోందని తెలిసిందే. అక్టోబర్ 2022లో 50,000గా ఉన్న సంస్థ ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటూ రాగా, వారి సంఖ్య దాదాపు 31 నుంచి 33 వేలు అయింది. కానీ సంస్థ నుంచి తొలగించిన తరువాత మాజీ ఉద్యోగులకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి సైతం ఆపసోపాలు పడుతోంది. తమకు రావాల్సిన సెటిల్మెంట్ నగదును సంస్థ ఇవ్వడంలో విఫలమైందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 45 రోజుల్లో FNF చెల్లించాలి. కానీ మూడు నెలలు గడిచినా ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయడంలో సరిగ్గా వ్యవహరించలేదని మాజీ ఉద్యోగి ఒకరు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేయడంతో వైరల్ అయింది. రవీంద్రన్‌, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్‌ 2011లో బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను  ప్రారంభించారు. విద్యార్థులకు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి దీని ద్వారా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్ అందించారు. ఈ క్రమంలో 2015లో బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ వచ్చింది. కరోనా వ్యాప్తి సమయంలో యాప్ కు ఎక్కడాలేని రెస్పాన్స్ రావడంతో మరింత పాపులర్‌ అయ్యింది. కరోనా తగ్గాక మళ్లీ ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకునే వారి సంఖ్య భారీగా పతనమైంది. ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, డెడ్ లైన్ లకు నిధులు సమకూర్చుకోలేక పోవడం లాంటి సమస్యల్ని పరిష్కరించడంలో బైజూస్ మేనేజ్ మెంట్ బిజీగా ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్