Sunday, September 8, 2024

తాడేపల్లిగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి

- Advertisement -

తాడేపల్లిగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి

-ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం,

తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తయారు చేస్తామని మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్  పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి నీ గురువారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్ లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని ఆయన ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక సదుపాయాలతో పాటు మరింతమంది వైద్యుల నియామకం కోసం కృషి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ప్రజలకు సేవలు అందిస్తుండగా మరో 600 పడకల ను పెంచే విధంగాచర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యులు కూడా వారికి శక్తికి మించి పేద ప్రజలకు సేవలందించి రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెంను వైద్యరంగంలో ముందుంచేందుకు కృషి చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వైద్యుల సహకారం కూడా తీసుకుంటామని వారితో ఇప్పటికే మాట్లాడామన్నారు.  ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ సూర్యనారాయణ మూర్తి  మరియు 11 వ వార్డు ఉమ్మడి నాయకులు కాళ్ల గోపి, ఏరుబండి సతీష్, యాదవ శివాజీ, కిషోర్ సాయి జగదీష్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి నాయకులు వర్తనపల్లి కాశి, పట్నాల రాంపండు, గురుజు సూరిబాబు, పై బోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబి, సజ్జ సుబ్బు, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, పైబోయిన వెంకటరామయ్య, నీలిపాల దినేష్ యాదవ్, బైయనపాలెపు ముఖేష్  సందాక రమణ, కూచిపూడి వెంకటరత్నజీ, మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్