Sunday, September 8, 2024

ఏకలవ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

- Advertisement -

ఏకలవ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

పెద్దపల్లి

Ekalavya Corporation should be formed

ఏకలవ్య కార్పోరేషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధిని విడుదల చేయాలని ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు రేవెల్లి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికంగా బుధవారం ఏకలవ్య జయంతి వేడుకలు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, జిల్లా కేంద్రంలో ట్రైబల్ కార్యాలయం ఏర్పాటుచేసి ఎరుకల సభ్యులకు రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. ఎరుకల జాతి అభ్యున్నతికి ఏకలవ్యుని బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్, ఏకలవ్య సేవా సమితి జిల్లా అధ్యక్షులు మానుపాటి రవి, దాసరి కిష్టయ్య, లోకిని మల్లేష్, రేవెళ్లి శీనయ్య, మానుపాటి సంపత్, వెంకటేష్, సార్ల సాయిలు, మానుపాటి ఆంజనేయులు, వాల్మీకి సంఘం నాయకులు ట్యాంక్ జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్