- Advertisement -
టీ బదులు పురుగు మందు తాగి వృద్ధుల మృతి
Elderly people died after drinking pesticide instead of teaరాజమండ్రి, సెప్టెంబర్ 14, (వాయిస్ టుడే)
ఆ వృద్ధురాలికి సరిగ్గా కళ్లు కనిపించవు. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందుతో టీ తయారు చేసింది. దీన్ని తాగిన ఆ వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. అప్పాయమ్మకు కంటి చూపు సరిగ్గా లేక టీ పొడి అనుకుని పురుగుల మందు ప్యాకెట్ ఓపెన్ చేసి దాంతో టీ పెట్టింది. ఆ టీ ఇద్దరూ తాగగా కొద్దిసేపటికి నోటి నుంచి నురగలు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన స్థానికులు వారిని వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




