Sunday, September 8, 2024

ఎన్నికల నోటిఫికేషన్… అక్టోబరు  2వ వారంలో

- Advertisement -
Election notification… 2nd week of October
Election notification… 2nd week of October

హైదరాబాద్, ఆగస్టు 25:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం 2024 జనవరి 16 వరకు ఉండగా.. 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చివరి ఎన్నికలు జరిగాయి. అయితే కేసీఆర్ 2018లో ఐదేళ్లు పూర్తి కాకుండానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. EC అక్టోబర్ 6, 2018న షెడ్యూల్‌ను విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలల క్రితం డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది. జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రస్తుత అసెంబ్లీ జనవరి 16 వరకు మనుగడ సాగించే అవకాశం ఉంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఏకకాలంలో నోటిఫై చేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి రెండుసార్లు రానుంది.

ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత సీఈసీ బృందం మరోసారి రాష్ట్రానికి రానుంది. అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ డబ్బు ప్రభావం పెరిగిపోయిందని మొన్నటి, హుజూరాబాద్ ఉప ఎన్నికలను బట్టి చెప్పవచ్చు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీలు పెద్దఎత్తున డబ్బు పంచినట్లు ప్రచారం సాగింది. దీంతో ఎన్నికల్లో డబ్బు ప్రభావం పడకుండా నిఘా పెంచనున్నారు. ఎన్నికల సంఘం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను కూడా మోహరించనుంది.క్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అవుతోంది. అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్…2018లో ఏడాది ముందుగానే అసెంబ్లీను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.  2018 అక్టోబరు 6న షెడ్యూల్‌, డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు కూడా జనవరిలోనే ముగియనుంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం డిసెంబరు 17తో ముగియనుంది. అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతోపాటు స్థానిక పండగల సెలవులపైనా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది.  అక్టోబరు, నవంబరు నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు ఉన్నాయ్. ఈ పండుగలను తెలంగాణలో అత్యంతవైభవంగా నిర్వహిస్తారు. ఇవి తప్పా వేరే సెలవులు లేవు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. షెడ్యూల్‌ ప్రకటించటానికి ముందు ఒకసారి…  నామినేషన్ల గడువు ముగిసిన తరవాత ఈ పర్యటనలు చేస్తుంది. ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం…ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు. డిసెంబరులోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిసెంబరు 10లోపు పోలింగ్ ను పూర్తి చేసి…వారం రోజుల్లోనే కౌంటింగ్  నిర్వహించేలా కసరత్తు చేసింది.  ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు అధికారుల గుర్తింపు ప్రక్రియను షురూ చేసింది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించనుంది. అక్టోబరులో రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎన్నికల నిర్వహణపై సమీక్షించనుంది. మరోవైపు బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్…ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆశావహులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీజేపీ మాత్రం అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్