నందిగామ మునిసిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా….
Election of Nandigama Municipal Chairman Postponed
మంగళవారం ఉదయం 11 గంటలకు…
నందిగామ
నందిగామ మునిసిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. అధికార కూటమి పార్టీ కి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి హజరు కాకపోవడం తో కోరం లేక మునిసిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ ప్రకటించారు. ఎన్నికల కమీషన్ అదేశాల మేరకు సోమవారం ఉదయం 11గంటలకు నందిగామ మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల అధికారిగా నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ పర్యవేక్షణలో బాబు జగజ్జీవన్ రావు కమ్యూనీటి హల్ లో ఏర్పాట్లు చేశారు. మెత్తం 18 మంది కౌన్సిలర్లు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య, ఎమ్మెల్సీ మొండితోక ఆరుణ్ కుమార్ కు చైర్మన్ ఎన్నిక కోసం సర్క్యులర్ అందజేశారు. ఆర్డీఓ బాలకృష్ణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా వైసిపీ కి చెందిన 5 గురు కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూటమి కి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్లు వారికి మద్దతు గా ఉన్న వారు ఎన్నికల ప్రక్రియ లో పాల్గొనేందుకు హజరు కాకపోవడం తో కోరమ్ లేనందున చైర్మన్ ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ బాలకృష్ణ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎసిపి తిలక్ మునిసిపల్ కమీషనర్ ఈవీ రమణబాబు ఉన్నారు