ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
Election of new committee of Press Club
అధ్యక్షులు బిజ్జెం. వెంకటరామిరెడ్డి
ప్రధాన కార్యదర్శి జి. ప్రవీణ్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
బూర్గంపాడు మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్
నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపాడు లోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో జరిగిన సమా వేశానికి సీనియర్ పాత్రికేయులు తోకల మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా బిజ్జెం. వెంకటరామిరెడ్డి( సాక్షి), ప్రధాన కార్యదర్శిగా జి.ప్రవీణ్ కుమార్ ( వెలుగు), కోశాధికారి గా గోడపర్తి .రాంబాబు (వార్త ) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గా తోకల. మోహన్ రావు, గౌరవ సలహాదారు లుగా కొండారెడ్డి, అజ్మీర వెంకన్న, ఉపాధ్యక్షు లుగా మారుడి. చంద్రశేఖర్ రెడ్డి, మందపాటి. వెంకటరెడ్డి, రాము, సహాయ కార్యదర్శులుగా గొట్టేముక్కల. అన్వేష్ రాజ్, పల్లంటి రమేష్, ఎన్నుకున్నారు. అదేవిధంగా ఆర్గ నైజింగ్ సెక్రట రీ బర్ల జోష్, ప్రచార కార్యదర్శి తేజవత్. గాంధీ, కమిటీ సభ్యులుగా జక్కిరెడ్డి. మల్లారెడ్డి, పోలిన రామకృష్ణ, చారి, దుద్దుకూరి మురళీకృష్ణ, కం దుకూరి శ్రీనివాస చారి, మహేష్ లను ఎన్నుకు న్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తాం:
జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు బిజ్జెం వెంకటరామి రెడ్డి, జి.ప్రవీణ్ కుమార్ లు అన్నారు. జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాల సాధన, ఇన్సూరెన్స్ ఏర్పాటు కృషి చేస్తామని వారు తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టను న్నట్లు వారు పేర్కొన్నారు.