ఎన్నికల నియమావాళిని ఖచ్చితంగా అమలు చేయాలి–జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
Election rules must be strictly enforced--District Collector Rahul Sharma
జయశంకర్ భూపాలపల్లి,
ఎన్నికల నియమావళిని
పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా
కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయుటకు నోడల్ అధికారులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం వరంగల్-ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బంధీగా అమలు చేయా లని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై నోడల్ అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపి వేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కవర్ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంగం మార్గదర్శకాల. మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.