Sunday, February 15, 2026

శనివారం విడుదల కానున్న ఎన్నికల షెడ్యూల్

- Advertisement -

శనివారం విడుదల కానున్న ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ట్వీట్ చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్లను ఇటీవల నియమించగా.. వీరు శుక్రవారం ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈసీ వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఇటీవల అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్కి చెందిన సుఖ్భీర్ సింగ్ సంధుని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురి పేర్ల పరిశీలన అనంతరం వీరిని ఎంపిక చేయగా.. వెను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్