Sunday, September 8, 2024

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలి: రోనాల్డ్ రోస్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబర్ 18:   ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్ లో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనీలకు,  A L M Ts మాస్టర్  ట్రైనీలకు, ( MTs) స్పెషల్ ఆఫీసర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి శిక్షణ కల్పించారు.

Election staff must work hard to conduct elections effectively: District Election Officer Ronald Rose
Election staff must work hard to conduct elections effectively: District Election Officer Ronald Rose

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… ఎన్నికల నిర్వహణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం గా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజకవర్గాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది సుమారు 34 వేల మందిని నియమించడం జరిగిందన్నారు. పోలింగ్ కు ముందు రోజు పోలింగ్ రోజున  పీఓ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నియమావళి  ప్రకారం అనుసరించాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. తప్పని సరిగా తీసుకొని పోవాల్సిన సంబంధిత మెటీరియల్ ను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా తీసుకున్న వాటి పరిశీలన చేసుకునే పద్ధతుల పై  పలు అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. తీసుకున్న ఎన్నికల పరికరాలు నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లాలని తెలిపారు. పోలింగ్ రోజు ముందు గా మాక్ పోలింగ్ ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించి అనంతరం మాక్ పోల్ ను సర్టిఫై చేయాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ మహిళా అధికారులకు పోలింగ్ ముందు రోజు అక్కడ ఉండకుండా ఇంటికి పోయే వెసులుబాటు కల్పించినట్లు  అయితే  మరుసటి పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు నేరుగా పోలింగ్ స్టేషన్ కు ఉదయం 5 లోగా సంబంధిత పోలింగ్ స్టేషన్ లో ఉండాలన్నారు. ఉదయం  5.30 గంటలకు మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. మాక్ పోలింగ్ కనీసం ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు మాక్ పోలింగ్ లో ఉండకూడదని మీటింగ్ సందర్భంగా  ఉండకూడదని వివరించారు.  ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ రోజు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. త్వరలో జరిగే ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఫారం-12 లను అందజేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో మహిళా పోలింగ్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 128 అనుసరించి సీక్రసీ ఆఫ్ ఓటింగ్ లో భాగంగా ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు.  ఉల్లఘించిన చో మూడు నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారుల వద్ద ఎలక్ట్రోరల్, ఏ.ఎస్.డి (ఆబ్సెంట్, షిఫ్ట్, డిలీట్) జాబితా తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

Election staff must work hard to conduct elections effectively: District Election Officer Ronald Rose
Election staff must work hard to conduct elections effectively: District Election Officer Ronald Rose

పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నా సెక్టోరల్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈ.వీ.ఎం లను భద్రంగా రిటర్నింగ్ అధికారి కి సమర్పించాలన్నారు. పోలింగ్ రోజు ఈ.వీ.ఎం  లలో బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసిన తర్వాత ఏడు సెకన్లలో వి.వి.ప్యాట్ లో (ఓటరు వెరిఫికేషన్ పేపర్ అండ్ ఆడిట్ ట్రయల్) బీప్ సౌండ్ ద్వారా ఓటు నమోదు గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు బ్యాలెట్ యూనిట్ (బి.యు) ద్వారా ఓటు వేసినాక వి.వి.ప్యాట్ లో పేపర్ జనరేట్ కాకపోతే వెంటనే ఆర్.ఓ కు సమాచారం అందించి సంబంధిత బ్యాలెట్ యూనిట్ మార్పునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది పోటీలో ఉన్న పక్షంలో  రెండు బ్యాలెట్ యూనిట్ లు ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఈ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం కొత్తగా 80 సంవత్సరాలకు పైబడిన వృద్దులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నచో పోలింగ్ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటును స్వీకరిస్తారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్  విన్నవించినా వారు  తిరిగి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని చెప్పిన అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఓటరు లిస్ట్ లో పోస్టల్ బ్యాలెట్ అని తెలియజేసినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బి.ఎల్.ఓ ద్వారా ఓటరు హెల్ప్ లైన్ కౌంటర్ల ను ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కంపార్ట్ మెంట్ లో  సరైన లైటింగ్ ఉండాలి, సీక్రసీ ఆఫ్ ఓటు ను పాటించాలన్నారు. పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3 ద్వారా ఓటరు లిస్ట్ చదవడం, ఇంక్ వేయడం, ఓటరు పేరు నమోదు చేయడం లాంటి  విధులు  ప్రిసైడింగ్ అధికారులు కేటాయించాలన్నారు. ఓటింగ్ పూర్తయ్యి న తర్వాత  ఓట్ల నమోదు  పై  ఈ వి ఏం  ద్వారా పరిశీలన చేసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది ఓటు నమోదు చేసిన మొత్తం కంట్రోల్ యూనిట్ ద్వారా  పోలైన ఓట్లను సరి చేసుకోవాలని తెలిపారు.  పోలింగ్ రోజున పి ఓ  లు క్రింది స్థాయి సిబ్బంది కానీ ఏజెంట్ ల సూచనలు పాటించి తప్పు చేయకూడదు. ఎన్నికల నిబంధనలు పాటించి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. పోలింగ్ సందర్భంగా చెక్ ఓటు, టెండర్ ఓటు,  ఛాలెంజ్ ఓటు  పై  నియమ నిబంధనలు పాటించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ రోజున అంధులు, బలహీనంగా ఉన్న ఓటర్లు తమ వెంట తెచ్చుకునే సహాయకులకు రైట్ హ్యాండ్ లో ఇంకు మార్కు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటింగ్ సమయం ముగిసే సమయంలో క్యూలో నిలబడిన వాళ్లకు ఓటు హక్కు  వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.
డిప్యూటీ డి.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ… ఎన్నికల్లో విధులు నిర్వహించే ఆర్.ఓ లు పి.ఓ లు, సెక్టోరల్ ఆఫీసర్లు టీమ్ లాగా పని చేయాలని తెలిపారు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. వీరికి ఎన్నికల నియమావళి కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించామని తదనుగుణంగా విధులు నిర్వహించాలని తెలిపారు.  పోలింగ్ నిర్వహించే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ  శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, ఖైరతబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, కంటోన్మెంట్ సి ఈ ఓ  మధుకర్ నాయక్, జాయింట్ కమిషనర్ వెంకట్ రెడ్డి,  సునంద తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్