Sunday, September 8, 2024

ఎన్నికల నగారా మ్రోగింది –  కులం యొక్క ముఖచిత్రం మారేనా❓

- Advertisement -

ఎన్నికల డప్పు మోగిన మన కుల సంఘ నాయకుల చెవిలోని జివిని కదిలించలేకపోయాయి. ఎన్ని సదస్సులు ,సమావేశాలు కులానికి గుర్తింపు తేలేకపోయాయి.పేరుకే కులంలో మంత్రి ,ఎంపీ , తోమ్మిది మంది ఎమ్మెల్యేలు, నామమాత్రపు ఎమ్మెల్సీలు, తోమ్మిది సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చాందసంగా ఉన్న వీరి శైలి యువత  నిరాహార దీక్షలు, బైకు ర్యాలీలు, పాదయాత్రలు, కలెక్టరేట్ ముట్టడి, అసెంబ్లీని ఆగం చేయడము, ప్రగతి భవన్ పై పోరాటము అరెస్టులు– ఇవి చేసినా యువతకు సరైన ప్రోత్సాహం కులం నుండి లభించకపోవడమే  బంగారు తెలంగాణ బాటలో భవిష్యత్తును కోల్పోయిన మున్నూరు కాపులు ఎంతోమంది ఉండగా కూడా మన కులం భవిత మారలేదు.

election-town-rang-will-the-face-of-caste-change
election-town-rang-will-the-face-of-caste-change

కారణాలు అనేకం కులాన్ని వ్యక్తుల మధ్య తిప్పుకోవడం,సొంత ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం,రాజకీయ పార్టీలకు బాంచన్ దొర అనడం. కొన్ని సంఘాలు స్వయం ప్రకటిత అధ్యక్షులుగా చలామణి చేయగా, మరికొన్ని సంఘాలు ఎన్నికలు జరిపి కూడా కోర్టు చెక్కర్లతో కులానికి మోయలేని అవమానాన్ని చేకూర్చారు

కులం అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. కులం కోసం సైనికుల పనిచేసే లక్షలాదిమంది ఉన్నా వారిని నిరుత్సాహ పరుస్తూ సొంత కోటరీ ఏర్పాటు చేసుకొని పబ్బం గడుపుకుంటున్న కులనాయకులు, అటు గ్రామ ,మండల, జిల్లా స్థాయిలో పేద మున్నూరు కాపులు వైద్యానికి ,విద్యకు అల్లాడుతుంటే, ఇటు నగరంలోనూ, నగరానికి అనుకున్న ప్రదేశాల్లో మున్నూరు కాపుల జీవనశైలి చిద్రంగా మారింది. కొందరి దాతల వల్ల కొందరికి చేయూత దొరికిన, అధిక శాతం కుల సోదరులు పేదరికంలోనే  మగ్గుతున్నారు

అన్ని కులాలకు ఇచ్చినట్టే ఆత్మగౌరవ భవనం అంటూ ఇచ్చిన కోకాపేట — కాకులు దూరని కారడివిలో ఉన్నట్టుగా, పూడ్చుకోలేని లోతగా ఉండి దిక్కులు చూస్తోంది. కొంతమంది నాయకులు దీన్ని భూతద్దంలో గ్రాఫిక్ లు చూపించి వాస్తవానికి దూరంగా 3d మాయ చేస్తున్నారు

కుల ముఖచిత్రం కొంతలో కొంత నైనా మారాలంటే కులాన్ని మభ్యపెట్టే నాయకులు మారాలి, యువతకు పగ్గాలు అప్పజెప్పాలి, రాజకీయ అవగాహన పెరగాలి, విద్యా వైద్యం కులంలోని అందరికీ అందుబాటులోకి రావాలి

హలంబట్టిన పొలం దున్నిన కులం నాది

మున్నూరు కాపు కులం మనది

జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు

 

  • బిల్లకంటి శ్రీనివాస్,  సికింద్రాబాద్
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్