Sunday, March 29, 2026

బీసీల గణన తర్వాతే ఎన్నికలు

- Advertisement -

బీసీల గణన తర్వాతే ఎన్నికలు

Elections will be held after the counting of BCs

హైదరాబాద్, సెప్టెంబర్ 27, (వాయిస్ టుడే)
దేశవ్యాప్తంగా కులగణన చేపయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటి వరకు ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతోందనే చర్చ అయితే నడుస్తోంది. ఇలాంటి టైంలో పీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నింటిపై చాలా మందిలో ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కులగణనకు సంబంధించిన ప్రకటన వస్తుందని అన్నారు.తెలంగాణలో బీసీలకు అండగా ఉండటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు మహేష్‌గౌడ్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. కీలకమైన కులగణనకు సంబంధించిన గైడ్‌లైన్ మూడు నాలుగు రోజుల్లో రానున్నాయని తెలిపారు. అవి పూర్తి అయిన తర్వాత బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల అంశాన్ని తేలుస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారని కూడా చెప్పేశారు.త్వరలోనే బీసీ సంఘాలను సీఎం వద్దకు తీసుకెళ్తానని మహేష్‌ మాట ఇచ్చారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లు, అన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామన్నారు. అంతే కాకుండా కుల గణన పూర్తైన తర్వాత నిజాం గ్రౌండ్స్‌లో సభ పెట్టి సీఎం రేవంత్‌ను సన్మానిద్దామని పిలుపునిచ్చారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వం పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో, బిహార్‌లో అధికారంలో ఉన్నప్పుడు కుల గణన చేసి చూపించామన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్‌లు, ఇతర సమస్యలపై ఓవైపు నుంచి కృష్ణయ్య పోరాటానికి సిద్ధమవుతున్నారు. అదే టైంలో బీఆర్‌ఎస్‌ కూడా ఒత్తిడి తీసుకొస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీసీ సమస్యలు పరిష్కరించి కృష్ణయ్య లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీలు తమవైపే ఉండేలా ప్లాన్ చేస్తోంది. అందుకే ఆయన వద్దకు రాయబారం కూడా పంపించారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్యతో మల్లు రవి సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇటు బీఆర్‌ఎస్‌కి కూడా అవకాశం ఇవ్వండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కుల గణన పూర్తి చేసి సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే వచ్చే వారంలో కులగణనకు సంబంధించిన కీలక ప్రకటన చేయనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్