- Advertisement -
ఈ యేడాది పెరిగిన ఎమర్జేన్సీ కాల్స్
Emergency calls have increased this year
అగ్ని మాపక దళ వార్షిక నివేదిక
హైదరాబాద్
15మీటర్స్ పైన ఉన్నవి అన్ని హై రైస్ బిల్డింగ్ కింద పరిగనిస్తాం. ప్రతి హై రైస్ బిల్డింగ్ లో శిక్షణ కలిగిన ఫైర్ సిబ్బంది వుంటారు. ప్రతి హై రైస్ బిల్డింగ్ లో ఫైర్ స్ప్రింక్లర్ ఉంటుంది.. పొగ రాగానే వెంటనే నీళ్లు చల్లి ఆర్పేలా సిస్టమ్ మెయింటైన్ చేస్తారని అగ్ని మాపక దళం డీజీపీ నాగిరెడ్డి వెల్లడించారు. రెండు గంటలపాటు ఫైర్ ఎక్కువ వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు హై రైస్ బిల్డింగ్ లో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ 3500వరకు హై రైస్ బిల్డింగ్ వున్నాయి. 700వరకు ఎన్ఓసి లు ఇచ్చాము. కొన్ని ఇంకా నిర్మాణం లో వున్నాయి. 2024సంవత్సరంలో 7383 ఫైర్ కాల్స్ వచ్చాయని అన్నారు.
7093స్మాల్ ఫైర్, 180మీడియం ఫైర్ కాల్స్, 87సీరియస్ ఫైర్ ఆక్సిడెంట్ కాల్స్,24మేజర్ ఫైర్ కాల్స్ వచ్చాయి. 2023తో పోలిస్తే 2024లో ఫైర్ కాల్స్ 0.23%తగ్గాయి. రెస్క్యూ కాల్స్ లో భాగంగా 1767వరద సహాయక కాల్స్ రాగ, అగ్ని ప్రమాదాలు 495,లిఫ్ట్ రెస్క్యూ 40కాల్స్, ఇతర కాల్స్ 54, జంతువుల రక్షణ 103వరకు వచ్చాయి.. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం లో 7.29శాతం రెస్క్యూ కాల్స్ పెరిగాయి. అత్యవసర ఫైర్ కాల్స్ లో భాగంగా డెడ్ బాడీ రికవరీ 435,మరియు జంతువు రికవరీ 6 కాల్స్ వచ్చాయి. వాహన ప్రమాదాలు 28,రోడ్ ప్రమాదాలు 25,కూలిన భవనాలు10,కూలిన చెట్లు 22,సెలర్స్ 27 ఫైర్ కాల్స్ వచ్చాయని అన్నారు.
2023తో పోలిస్తే ఈ సంవత్సరం లో ఎమర్జెన్సీ కాల్స్ 10.82శాతం పెరిగాయి. ఫైర్ సేఫ్టీ కై అనేక అవగాహనా కార్యక్రమలు చేస్తున్నాం.అందులో భాగంగా పలు ఆకస్మిక తనిఖీలు చేసామని అన్నారు. 42,772హాస్పిటల్ లో తనిఖీ మరియు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసాము.. 19581పరిశ్రమలలో ఫైర్ అవగాహనా కార్యక్రమాలు చేసాము.. విద్యసంస్థలలో 6370,రెసిడెన్సీయల్ 6331,ఇతర అవగాహనా కార్యక్రమాలతో పాటు మొత్తం 15లక్షల వరకు తెలంగాణ వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేసాము. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం అవగాహనా కార్యక్రమాలు 81.71శాతం పెరుగుదల నమోదు అయింది. ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వనికి 34.79కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
- Advertisement -