Sunday, September 8, 2024

ఎంప్లాయిస్ సర్వే… ఏంటంటే…

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 1, (వాయిస్ టుడే):  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఖరారు చేసేశాయి. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ వెనుకబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సీపీఎస్ ఉద్యోగులు, టీచర్లు ఉమ్మడిగా నిర్వహించిన మరో ఎగ్జిట్ పోల్ కూడా బయటికి వచ్చింది. ఇందులోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపించగా.. అదే సమయంలో ఇందుకు గల కారణాలను చక్కగా వివరించింది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 65-75 స్ధానాలు వస్తాయని సీపీఎస్ ఉద్యోగులు, టీచర్ల ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. అధికార బీఆర్ఎస్ కేవలం 45-55 సీట్లతో సరిపెట్టుకుంటుందని తేల్చారు. బీజేపీకి 6-10 సీట్లు, ఎంఐఎంకు 4-7 సీట్లు, జనసేన, ఇతరులకు 1-3 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ తెలిపింది. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపట్టడం ఖాయమని ఈ ఎగ్జిట్ పోల్ కూడా తేల్చేసింది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు వెనుక కారణాలను కూడా ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇందులో ఈసారి బీజేపీకి ఓటు వేయాలని అనుకున్నవారి ఓట్లలో 60 శాతం కాంగ్రెస్ కు పడ్డాయని తేలింది. మండల స్దాయు నాయకులు పూర్తి గా కాంగ్రెస్ కు సాయం చేశారని తెలిసింది. బీఆర్ఎస్ కు వేయాలని అనుకున్నవారి లో 20 శాత ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు పడినట్లు ఈ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. అలాగే తెలంగాణలోని ప్రతీ ఊళ్లో స్ధిరంగా ఉన్న కనీసం 500 ఓట్లలో ఈసారి 80 శాతం కాంగ్రెస్ కు పడినట్లు ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ లో జిల్లా స్దాయి, మండల స్దాయి మెజారిటీ నాయకులు సరిగా పార్టీకి పనిచేయలేదని తేలింది. వీరంతా సొంత పార్టీపై అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ కు సహకరించారని తేలింది. అలాగే సీపీఎస్ ఉద్యోగులు, టీచర్లు కూడా ప్రభుత్వానికి సహకరించలేదని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈసారి గతానికి భిన్నంగా ఎవరి పని వాళ్లు చేశారని, ఎవరికీ ఎవరూ వెన్నుపోట్లు పొడుచుకోలేదని ఎగ్జిట్ పోల్ విశ్లేషణ తేల్చింది. అలాగే పొరుగున ఉన్న కర్నాటక కాంగ్రెస్ నేతల నుంచి ఇక్కడి కాంగ్రెస్ నేతలకు అన్ని విధాలుగా సహకారం అందిందని తేలింది. ముఖ్యంగా కర్నాటకను ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు దీంతో బాగా లబ్ది పొందారు. అలాగే రాహుల్, ప్రియాంక ప్రచారం రూరల్ ప్రాంతాల్లో బాగా పనిచేసిందని తేల్చారు. అదే సమయంలో కేసీఆర్ ప్రచారంతో బీఆర్ఎస్ కు అదనంగా ఎలాంటి లబ్దీ చేకూరలేదు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వ్యవహారం కేసీఆర్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో బాగా నష్టం కలిగించినట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది. అలాగే కేసీఆర్, బీజేపీ, ఎంఐఎం కలిసిపోయినట్లు కాంగ్రెస్ చేసిన ప్రచారం కూడా సక్సెస్ అయిందని వెల్లడించింది. హైదరాబాద్ లో ఎంఐఎంకూ దీంత భారీ నష్టం జరిగిందని తేల్చింది. అటు ప్రభుత్వ వ్యతిరేకతను చూస్తే.. పట్టణాల్లో 40 శాతం గానూ, గ్రామాల్లో 25 శాతంగా ఉందని తేలింది. ఉద్యోగుల్లో వ్యతిరేకత 45 శాతంగానూ, ఐటీ ఉద్యోగుల్లో 70 శాతం, మైనార్టీలో 40 శాతం, నిరుద్యోగుల్లో 80 శాతం వ్యతిరేకత ఉందని తేలింది. ఇదే బీఆర్ఎస్ కొంప ముంచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్