ఆటోమొబైల్ రంగంతో యువతకు ఉపాధి:మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
Employment for youth with automobile sector: Former MP TG Venkatesh
యువత స్వయం ఉపాధి తో ఉన్నత స్థాయికి ఎదగాలి
గౌరు వెంకటరెడ్డి
కర్నూలులో ఘనంగా రాయలసీమ ఆటోమొబైల్స్ షాపు ప్రారంభం
కర్నూలు , డిసెంబర్ 14:
ఆటోమొబైల్ రంగంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు స్వశక్తితో యువతీ యువకులు ముందడుగు వేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు ఆటోనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాయలసీమ ఆటోమొబైల్ హోల్ సేల్ షాపును టిడిపి సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి తో కలిసి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అట్టహాసంగా ప్రారంభించారు. ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువతి, యువకులు స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి చూపి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. తద్వారా దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారు అవుతారని చెప్పారు. యువత స్వయం ఉపాధి పథకాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఆటోమొబైల్ పారిశ్రామిక రంగంలో నిరుద్యోగులు, విద్యావంతులకు ఉపాధి, అభివృద్ధి అవకాశాలు ఉన్నాయన్నారు. నూతన పరిజ్ఞానంతో రోజురోజుకు ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని వీటికి అనుగుణంగా ఆటోమొబైల్ రంగ కార్మికులు వ్యాపారస్తులు, నడుచుకోవాలన్నారు. ఆటోమొబైల్ రంగం నిరుద్యోగులు ,కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి దశకు చేరుస్తోందని ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ మహబూబ్ బాషా అన్నారు. రాయలసీమ ఆటోమొబైల్స్ షాప్ ప్రారంభం సందర్భంగా మద్రాస్ ఆటో స్పేర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, జై స్పేర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ భరత్, రాణి స్పేర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి నరేష్ కుమార్, గల్ఫ్ ఆయిల్ ప్రతినిధి మధుసూదన్, సర్వో ఆయిల్ ప్రతినిధి వంశీ కుమార్, అమరన్ ఆయిల్స్ ప్రతినిధి సుగుణాకర్ తదితరులను రాయలసీమ ఆటోమొబైల్స్ అధినేత అబ్దుల్ సత్తార్ తో కలిసి టీజీ వెంకటేష్ , గౌరు వెంకట్ రెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ మెకానిక్ లు ,వివిధ స్పేర్ పార్ట్స్ కంపెనీల ప్రతినిధులు , ఆయిల్ కంపెనీల డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు