“ఫ్యామిలీ స్టార్” సినిమా చూస్తూ సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు – ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్ పెట్ల
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు. ప్రేక్షకుల సందడి మధ్య “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ – “ఫ్యామిలీ స్టార్” సినిమా గురించి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్ లో హాయిగా చూడండి. ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. విజయ్, మృణాల్ క్యారెక్టర్స్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ..వంటి అన్ని అంశాలు మీకు నచ్చేలా ఉంటాయి. థియేటర్ లో మిమ్మల్ని కలుస్తాను. అన్నారు.