Sunday, September 8, 2024

సౌండ్ పార్టీ చిత్రంతో రెండు గంటలపాటు నాన్ స్టాప్ కామెడీని ఎంజాయ్ చేస్తారు

- Advertisement -

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు.  ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా  ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజయ్ శేరి మీడియా మిత్రులతో ముచ్చటించారు.

“మాది కామారెడ్డి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగడంతో రైటింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. పూరి జగన్నాథ్ గారిని ఇన్స్ పైర్ గా తీసుకొని.. డైరెక్టర్ అవ్వాలనుకున్నా.  మారుతి, సంపత్ నంది గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశా. కామెడీ ఎంటర్టైనర్లు అంటే నాకు ఇష్టం. అలాగే మా ప్రొడ్యూసర్స్ కు కూడా కామెడీ ఎంటర్టైనర్లు చేయడమే ఇష్టం. ఇంతకుముందు  చాలా కథలు విన్నా..ఈ కథను  బాగా ఎంజాయ్ చేశారు. జయశంకర్ గారి ద్వారా నేను వారికి ఈ కథ వినిపించాను. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.

Enjoy two hours of non-stop comedy with the Sound Party movie
Enjoy two hours of non-stop comedy with the Sound Party movie

ఇన్నోసెంట్ గా ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ పై  జరిగే కథ ఇది. ఈ పాత్రలకి సన్నీ,  శివన్నారాయణ కరెక్ట్ గా సూట్ అయ్యారు.  నా రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ నుంచే ఈ కథను రాశాను.   దర్శకుడుగా నాకు ఇది తొలి సినిమా అయినా.. ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉండడంతో వారంతా నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్స్ చేసాం కానీ ఎవరు సూట్ అవ్వలేదు. ఇందులో ఈ పాత్రకి టౌన్ అమ్మాయిలా తను కనిపించాలి. హ్రితిక శ్రీనివాస్ ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయింది. మేం సెలెక్ట్ చేసిన తర్వాత తను ఆమని మేనకోడలు అని తెలిసింది. శివన్నారాయణ గారిలో మంచి హ్యూమర్ ఉంటుంది.

ఆయన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన సినిమా  ఇది. అమృతం సీరియల్ లో ఆయన పాత్ర చూసి ఎలా ఎంజాయ్ చేసామో.. ఇందులో అంతకుమించి ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి బూతులు  లేకుండా పంచ్ డైలాగులతో.. రెండు గంటలపాటు క్లీన్ కామెడీని ఎంజాయ్ చేస్తారు.   క్లైమాక్స్ లో ఎమోషన్స్, సెంటిమెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. కథలో నుంచి ఫన్ రావటంతో.. సిచువేషన్ కామెడీని ఆడియన్స్ ను ఆద్యంతం అలరిస్తుంది. లేనిది ఊహించుకుంటే ఎలా ఉంటుందని దానిపైనే అసలు నా కాన్సెప్ట్ వచ్చింది. అందులో భాగంగానే బిట్ కాయిన్ ను తీసుకున్నాం.

జయశంకర్ గారు నేను ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. నన్ను దర్శకుడిగా చేయడానికి ఆయన చేసిన సపోర్టు మరువలేనిది. నిర్మాతలు రవి గారు, మహేంద్ర గారు ఈ ప్రాజెక్టు విషయంలో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి  చాలా సపోర్ట్ గా నిలిచారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా విజయం సాధిస్తుందని  టీమ్ అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

ఇక హీరో శివ కార్తికేయన్ గారితో సినిమా చేయాలని నా కోరిక. ఆయన కు నేను అభిమానిని.  ఆయనను కలిసి కథ చెప్పడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశా. నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నానని తర్వాత తెలిసింది. ఎప్పటికైనా ఆయనతో మంచి సినిమా తీస్తా”.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్