కమిషనరేట్ లో యాంటి నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు
డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్, డీ అడిక్షన్, ప్రి వెన్షన్ పైనా ప్రధాన దృష్టి
..
.పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం.
Establishment of Anti Narcotic Drug Control Cell
డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో
మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. ప్రధానంగా ఎన్‌ఫోర్స్‌మెంట్, డీ అడిక్షన్, ప్రి వెన్షన్ పైనా ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీస్ శాఖ యాంటి నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి సమాచారం వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. మాధకద్రవ్యాల క్రయ విక్రయాల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వాట్సప్ ద్వారా కాని సెల్ ఫోన్ ద్వారా ఫిర్యాదులు, సమాచారం అందజేసేందుకు అందుబాటులో వుండే యాంటీ డ్రగ్ కంట్రోల్ విభాగం 8712659123 సెల్ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు. పల్లెల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అటు గంజాయి వాడుతున్న వారిని సైతం గుర్తించి వైద్య సదుపాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఉన్న ఆంద్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ నుంచి రోడ్డు మార్గాల ద్వారా మత్తు పదార్థాలు రవాణా జరుగకుండా తనిఖీలు పటిష్ఠం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు.