Sunday, September 8, 2024

ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ ఏర్పాటు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 9:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సర్కారు తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పింఛనర్ల కోసం ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS)’ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు కుటుంబసభ్యులకూ ప్రయోజనం కలగనుంది.పథకం నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. అధికారులు, ఉద్యోగులు, పింఛనర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి జీవో నంబర్ 186ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల విరాళంతోనే ఈ కొత్త పథకం అమలుకానుంది. బిస్వాల్ కమిటీ సిఫారసుల మేరకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉద్యోగులందరికీ సమాన విరాళంతో సమాన చికిత్స అనే విధానాన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు హెల్త్ స్కీమ్ అమలు సంతోషకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన విధానంతో ఉద్యోగులు, పింఛనర్లు, కుటుంబీకులకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయన్నారు. ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి భారాస ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వెల్లడించారు. బట్టి సావర్గామ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న ఇళ్ల స్థలాల కోసం భూమి పూజ చేశారు. ఆదిలాబాద్ జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాల కల నెరవేరిందని ఎమ్మెల్యే రామన్న అన్నారు. ముందుగా జర్నలిస్ట్ జేఏసీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ . ఆదిలాబాద్ లో ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులు చేసిన పోరాటం ఫలించింది అని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. జేఏసీ పోరాటంతో పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా జేఏసీ కన్వీనర్ దేవేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఇంటి స్థలాల కేటాయింపులు ప్రత్యే ప్రత్యేక చొరో చూపిన ఎమ్మెల్యే జోగమ్మ అన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఆమోఘమైందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్‌ చేసిన పోరాటంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని గుర్తుచేశారు. ఉ ద్యమ సమయంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది జర్నలిస్టులు కదిలి ఉద్యమ నేత కేసీఆర్‌తో కలిసి కదం తొక్కారని గుర్తుచేశారు. సి‌ఎం కే‌సి‌ఆర్ సహకారంతో ఇండ్ల స్థలాలకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ సర్కారుతో జర్నలిస్టు లది తల్లీబిడ్డల అనుబంధమని ఎమ్మెల్యే అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్