- Advertisement -
అల్వాల్ పరిధిలో గణేష్ మండపాలను దర్శించుకున్న ఈటల రాజేందర్ ట్యాంక్బండ్ నిమజ్జనం పై స్పందన
Etala Rajender's response to tankbund immersion after visiting Ganesh mandapams
అల్వాల్
అల్వాల్ లోని వివిధ గణేష్ మండపాలను ఎంపి ఈటెల రాజేందర్ సందర్శించారు. జాతి ఐక్యత కోసం భారతీయ సాంస్కృతి సాంప్రదాయమే ఈరోజు ఉదాహరణ ఈ గణేష్ ఉత్సవాలు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో విగ్నేశుని ప్రతిష్టించి తొమ్మిది రోజులు నిష్ఠతో తో పూజలు నిర్వహించి విఘ్నాలు తొలగిపోవాలని సమాజానికి గాని మానవులకు గాని విఘ్నాలు తొలగిపోవాలని దేశం రాష్ట్రం కుటుంబం బాగుండాలని నిష్టతో పూజలు చేస్తున్నారు అని ఆయన తెలిపారు. ట్యాంక్ బండ్ లో వినాయకుల నిమజ్జనం చేసేందుకు సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రభుత్వం గౌరవించక తప్పదని వారికి విరుద్ధంగా ఎటువంటి ఆస్కారం చేయొద్దని ఈటెల హెచ్చరించారు
పోయినవాళ్లు కాలగర్భంలో కలిసి పోతారని అన్నారు. ఈ రోజు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల తరబడి ట్యాంక్బండ్లో నిమజ్జనం జరుపుతున్నారు. నిజంగా ఆ నీరు గొప్ప చెరువుగా కొబ్బరి నీళ్ల లాంటి చేరువుగా మార్చినప్పుడు మనం ప్రత్యన్నాయం చూపొచ్చు గాని ఇవాళ గణేశుని వేస్తేనే నీరు కలుషితమైనట్టు మాట్లాడుతున్నారు ఆ నీరు ఎప్పుడో పొల్యూట్ అయింది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని మీద సోయి పేటలే గాని ప్రజల విశ్వాసం మీద దెబ్బ కొడితే మంచిది కాదని ప్రభుత్వం ఆలోచించాలా అని ఈటెల తెలిపారు
- Advertisement -