- Advertisement -
ఆకలితో ఉన్నవారి కడుపులోకి వెళ్లే ఒక్కొక్క మెతుకు వారికి ప్రాణాన్ని నింపేది
Every morsel that goes into the stomach of the hungry fills them with life
అమరావతి,
ఆకలితో ఉన్న వారి కడుపులోకి వెళ్లే ఒక్కొక్క మెతుకు వారికి ప్రాణాన్ని నింపేదేనని శీలంనేని రఘువరన్,తేజస్విని వివాహం సందర్భంగా పేదలకు భోజనం పెట్టేందుకు ముందుకు వచ్చిన శీలంనేని సాంబశివరావు,ఇందిరాదేవి దంపతులు అభినందనీయులని జనచైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు.పెదకూరపాడుకు చెందిన కాకతీయ విద్యాసంస్థల నిర్వాహకులు, రొటీరియన్ శీలమనేని సాంబశివరావు,ఇందిరాదేవి దంపతుల కుమారుడు రఘువరన్,తేజస్విని వివాహం సందర్భంగా జన చైతన్య సమితి ఆధ్వర్యంలో అమరావతి, ధరణికోట ప్రాంతంలోని 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని పంపిణీ చేస్తున్న సంస్థ ప్రతినిధులకు రఘువరన్ వివాహం సందర్భంగా పేదలకు అన్నదానం చేద్దామని చెప్పడంతో అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న యానాది కాలనీలో,ధరణికోట లో ఉన్న చెంచు కాలనీలో భోజనాలు తీసుకువెళ్లి పెట్టామన్నారు.శుభకార్యాల సమయంలో కొంతమంది పేదరికైనా అన్నదానం చేయాలనే శీలంనేని కుటుంబ సభ్యుల మంచి మనసుకు తుల్లూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు, వాలంటీర్లు బెజ్జం నాగేశ్వరరావు,తుళ్లూరి వెంకటేశ్వర్లు,బెల్లంకొండ మోహన్,దాసరి కారుణ్య బాబు,రాగిడి ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు
- Advertisement -