Sunday, September 8, 2024

*ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి లబ్ది చేకూరుస్తాం*

- Advertisement -
Every poor person will benefit under public governance

*హైదరాబాద్, డిసెంబర్ 26:*   ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి లబ్ది చేకూరుస్తానని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంచార్జి మంత్రులు రాష్ట్ర బి.సి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు లు వెల్లడించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో జిహెచ్ఎంసి పరిధిలోని 150 వార్డులకు నియమించిన టీమ్ లీడర్లు, సర్కిళ్ల స్పెషల్ ఆఫీసర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ప్రజా పాలన పై ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష అనంతరం మంత్రులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ…  ప్రజలు స్వేచ్ఛగా వచ్చి అధికారులకు తమ సమస్యలను తెలియజేస్తారని అన్నారు. ఆరు గ్యారంటిలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో ఆరు జోన్లు, ముప్పై సర్కిళ్ల పరిధిలోని ప్రజల వద్దకు అధికారులు వెళ్లి డేటా కలెక్షన్ చేస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కనుక ప్రతి డివిజన్ లో నాలుగు ప్రాంతాలలో టీం లీడర్ లను అందుబాటులో ఉంచామని, టీం లీడర్ తో పాటుగా ఏడుగురు సభ్యులు ఉంటారని తెలిపారు.

మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన లైన్ ఉంటుందని తెలిపారు. ప్రతి వార్డు కు టైం టేబుల్ ఇచ్చామని, డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు టైం టేబుల్ ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఆ వార్డులలో సమాచారం ఇస్తారని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వార్డుకు ఇంచార్జీలను కేటాయించామని, ఆరు గ్యారెంటీ లను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 48 గంటల్లోనే రెండు గ్యారంటీ లను అమలు చేశామని తెలిపారు. ప్రజా భవన్ లో ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారని, మేము ప్రజా సేవకులమని అన్నారు. రేపు బుధవారం స్పెషల్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వార్డులో నాలుగు లొకేషన్లలో కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…  ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని, మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని తెలిపారు. మీకు స్కీమ్ వర్తిస్తుంది అంటే దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి దరఖాస్తుకు అధికారులు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారని గుర్తు చేశారు. మహిళలకు ఇబ్బంది జరుగకుండా మరిన్ని కొత్త బస్సుల కొనుగోలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిగతా గ్యారెంటిలను ఈ దరఖాస్తుల ఆధారంగా అమలు చేస్తామని తెలిపారు.

ఎన్నికల వరకే రాజకీయాలు అని అభివృద్ధి లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలకు న్యాయం జరగాలి అన్నదే మా ధ్యేయం అని తెలిపారు. డేటా కలెక్షన్ తర్వాతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తామని అన్నారు. ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదని, లేని వారు అప్లికేషన్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఇప్పటివరకు 22 వేల అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. ఈ నెల 27న ప్రజా పాలన కు సంబంధించిన దరఖాస్తు ఫారం ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అందరి అనుమానాలు, సందేహాలు నివృత్తి అవుతాయని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత గౌరవం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పథకాలు అమలు కావాలంటే అధికారుల భాగస్వామ్యం ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని తెలిపారు. అందరి ప్రోత్సాహంతో ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు.

మేయర్ గద్వాల్ విజలక్ష్మి మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజల నుండి అందే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని కోరారు. ఈ పథకానికి వంద శాతం సహకరించడం జరుగుతుందని,  గతంలో జిహెచ్ఎంసి అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు లబ్ది పొందే ఆరు గ్యారంటీ పథకాలు మంచి కార్యక్రమం అయినందున వీటి అమలును పారదర్శకంగా చేయాలని కోరారు.

జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఏర్పాట్లను మంత్రులకు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…  600 లొకేషన్లలో దరఖాస్తుల స్వీకారణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి కౌంటర్ వద్ద మహిళకు, వృద్ధులకు, దివ్యాగులకు ప్రత్యేక లైన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరు గ్యారంటీలు కాకుండా ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి దరఖాస్తును స్వీకరించి రశీదు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, జోనల్ అధికారులు, టీమ్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్