“రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి”
-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి
రాయికల్(వాయిస్ టుడే)
“Every worker should work with the aim of hoisting the saffron flag over Raikal Municipality”
-BJP State Executive Member Boga Sravani
రాయికల్ పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
బోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు
రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి దీపాలు, తాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ అందించడంలో కూడా ప్రస్తుత పాలకులు విఫలమయ్యారు.
గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనకు రావలసిన అగ్నిమాపక కేంద్రని వేరే నియోజకవర్గానికి తరలించినప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అలాగే ‘పెద్ద చెరువు’ సుందరీకరణ పనులు నేటికీ పూర్తి కాకపోవడం విచారకరం.
మాదిగ కుంట దుర్వాసన వల్ల దోమల ఉధృతి పెరిగి, ప్రతి ఏటా రాయకల్ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న నాయకులు పట్టించుకోవడం లేదు.
డబల్ బెడ్ రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి వాటిని ఇప్పటివరకు పూర్తి చేయలేదు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మీ రాజకీయ లబ్ధి కోసం ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంటున్నారు.
పట్టణంలో డిగ్రీ కాలేజీ బిల్డింగ్ ఉన్నప్పటికీ, తగినంత స్టాఫ్ (బోధన సిబ్బంది) లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విద్యా సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
రాయికల్ పట్టణంలో వైకుంఠధామంలో డంపింగ్ యార్డ్ నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణంలోని వైకుంఠధామాలను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని కోరారు.
రాయకల్ పట్టణ ప్రజలు చాలా చైతన్యవంతులని, వారు అన్ని అంశాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో జరిగిన ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో సాధించిన మెజారిటీని స్పూర్తిగా తీసుకుని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కూడా బిజెపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి, రాయకల్ మున్సిపాలిటీపై బిజెపి జెండా ఎగరవేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, కునారపు భూమేష్, కడార్ల శ్రీనివాస్,మచ్చ నారాయణ,వాసం రామ,బన్న సంజీవ్,సమల్ల సతీష్,అల్లె నర్సయ్య, బొడుగం శ్రీకాంత్ మరియు పట్టణ పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


