Sunday, September 8, 2024

అందరూ విధుల్లో చేరండి

- Advertisement -

సెలవులు బంద్.. ఉద్యోగాల్లో చేరండి

హైదరాబాద్, జూలై 28, (వాయిస్ టుడే): తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు సెలువు ప్రకటించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ గడాల శ్రీనివాసరావు అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు. మరెవరైనా.. ఉద్యోగులు సెలవులో ఉంటే వెంటనే విధుల్లో చేరాలన్నారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ప్రధాన కార్యాలయంలోనే ఉండి విధులు నిర్వహించేలా అధికారులు చూడాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరదల వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.తెలంగాణలో అసాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. న్నాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్